Pawan: పవన్ ను ఘోరంగా అవమానించిన హీరోయిన్.. డేట్లు ఇచ్చి మరీ అలా చేసి?

Pawan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. గత ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా వరుస ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే పవన్ సినిమాలో ఒక పాటకు డాన్స్ చేయడం అంటే హీరోయిన్ లు అందరూ కూడా రెడీగా ఉండడంతో పాటు అలాంటి అవకాశం వస్తే వెంటనే ఓకే చెప్పేస్తూ ఉంటారు.

కాస్త చాన్స్ లు తగ్గిపోయిన హీరోయిన్లు అయితే ఎగిరిగంతేస్తారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం చేస్తానని చెప్పి చివరి నిమిషంలో డేట్ లు అవైలబుల్ లేవని చెప్పేసి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ కలిసి బ్రో అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. కేవలం రెండు పాటలు ఫినిష్ చేస్తే చాలు. వాటిల్లో ఒకటి స్పెషల్ సాంగ్. ఇద్దరు హీరోల మీద చిత్రీకరిస్తారు. ఈ పాటలో చిందులు వేయడం కోసం ఎవర్ని తీసుకోవాలా అని చాలా పేర్లు పరిశీలించారు.

 

చివరికి రకుల్ ప్రీత్ సింగ్ ను ఫైనల్ చేసారు. తెలుగు సినిమాలకు రకుల్ ఎందుకో చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం ఒకే చెప్పింది. తాజాగా షూట్ వుంది. కానీ రకుల్ మాత్రం తనకు డేట్ లు అడ్జస్ట్ కావడం లేదని. దీంతో యూనిట్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. రకుల్ ఎప్పుడు వస్తుందో కనుక్కుని ఆ డేట్ లకు పవన్ కళ్యాణ్ డేట్ లు మళ్లీ అడగడమా? లేకపోతే మరో హీరోయిన్ ను ఎవరినన్నా సెట్ చేయడమా అన్నది ఇప్పుడు చర్చల్లో వుంది. ఎవరూ లేకపోతే ఊర్వశి రౌతాలాను తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ కంటిన్యూ చేస్తారా లేదంటే మరో హీరోయిన్ తీసుకుంటారా అన్నది చూడాలి మరి.

 

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -