Viral: వైరల్ అవుతున్న హీరోయిన్ కామెంట్లు.. ఏం చెప్పారంటే?

Viral: సినీ ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ రకరకాల పాత్రల్లో యాక్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పాత్రలను బట్టి పారితోషకం కూడా ఎక్కువగానే ఉంటుంది.
అయితే ప్రముఖ హాలీవుడ్ నటి షారన్ స్టోన్ తాజాగా తన కొడుకు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆమె నటించిన న్యూడ్ సీన్ వల్ల తన కుమారుడికి దూరంగా కావాల్సి వచ్చిందని భావోద్వేగమైంది.

 

నటీనటులు సినిమాల విషయంలో చాలా సాహసాలు చేస్తుంటారు. పాత్ర నచ్చితే తమకు గుర్తింపు తెచ్చుందని భావిస్తే ఎలాంటి రోల్స్ లోనైనా నటించేందుకు సిద్ధపడుతారు. ముఖ్యంగా హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టర్స్ మరింత ముందడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ హాలీవుడ్ సీనియర్ నటి షారన్ స్టోన్ తన కేరీర్ లో చేసిన ఓ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కేరీర్ ప్రారంభంలో తన గుర్తింపు తెచ్చి పెట్టిన ఆ చిత్రమే, తన కొడుకునూ కోల్పోయేలా చేసిందంటూ భావోద్వేగమైంది.

1992లో వచ్చిన బేసిక్ ఇన్ స్టిక్ట్ షారన్ స్టోన్ న్యూడ్ సన్నివేశంలో నటించింది. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును సైతం తెచ్చిపెట్టింది. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ వచ్చింది. శృంగార తారగా పేరు దక్కించుకుంది. అయితే ఇదే సినిమాతో తన కొడుకు కూడా ఆమెకు దూరయ్యాడం బాధాకరం. ఇదే విషయాన్ని షారన్ స్టోన్ తాజాగా ‘ఐ హర్డ్ రేడియో’ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ వెల్లడించారు. తన కొడుకును కోల్పోవడం పట్ల ఎమోషనల్ అయ్యారు.

 

200‌‌0ల సంవత్సరంలో తన భర్త ఫిల్ బ్రోన్ స్టెయిన్ నుంచి విడాకులు కోరుతూ షారన్ స్టోన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అప్పటికే ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అయితే విచారణలో భాగంగా కోర్టులో జడ్జీ తన కొడుకును మీ అమ్మ సెక్స్ మూవీస్ చేస్తుంది తెలుసా అని ప్రశ్నించాడని తెలిపింది. ఆ సినిమా వల్లే నన్ను అపఖ్యాతి పాలు చేశారు. ఫలితంగా డివోర్స్ విచారణలో భాగంగా నా దగ్గర పెరగాల్సిన కొడుకు నాకు దూరమయ్యాడంటూ ఎమోషనల్ అయ్యింది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -