Bhupalpalli: భార్య,కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేసిన భర్త?

Bhupalpalli: ప్రస్తుత కాలంలో డబ్బు మనిషితో ఎంత పనైనా చేయిస్తోంది. మనుషులు కూడా డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా కూడా ఒడిగడుతున్నారు. డబ్బు కోసం ఒకరినొకరు చంపుకోవడం హత్యలు చేసుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. డబ్బు కోసమే కన్న తల్లిదండ్రులను పిల్లలు చంపేస్తుండగా పిల్లలను కూడా కన్న తల్లిదండ్రులు చంపేస్తున్నారు. అయితే సమాజంలో ఈ డబ్బు మోజులో పడి చాలామంది వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. డబ్బు కోసం దారుణాలకు ఓడిగట్టి కటకటాల పాలవుతున్నారు.

తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి జిల్లా వేశాలపల్లి గ్రామానికి చెందిన ఎలగంటి రమణాచారి, రమ అనే 43 ఏళ్ల వివాహిత ఇద్దరు భార్యాభర్తలు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వీరి కుమార్తె చందన 17 ఏళ్ల యువతి ఇంటర్ మీడియట్ సెకండియర్ చదువుతోంది. రమ స్థానికంగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అలా కొంతకాలం పాటు వీరి సంసారం ఎంతో సంతోషంగా సాగింది.

 

కొంతకాలానికి రమణ మద్యానికి బానిసగా మారి నిత్యం భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. రమణ ఎన్ని గొడవలు చేసిన ఎంతగా కొట్టినా కూడా రమ పిల్లల కోసం అతడి వేధింపులను భరిస్తూ వచ్చింది. పిల్లలు కూడా తండ్రిని తాగవద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా రమణ అలాగే తప్ప తాగేవాడు. మద్యం తాగి వచ్చిన ప్రతి సారి డబ్బులు కావాలంటూ వారి వేధింపులుకు గురి చేసేవాడు. పిల్లలు సైతం తండ్రి చేస్తున్న గొడవలకు నిత్యం భయం భయంగా గడిపేవారు. అలా తాజాగా కూడా రమణ బాగా తాగి ఇంటికి వెళ్లి మద్యం ఇంకా తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవ పెట్టుకున్నాడు.

 

అందుకు రమ నిరాకరించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రమణ మధ్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యను రమను నరికాడు. తల్లిపై దాడి చేస్తుండగా కూతురు చందన అడ్డుకునే ప్రయత్నం చేసింది. తప్ప తాగి ఉన్న రమణ కూతురు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి చందన ను కూడా నరికాడు. ఈ ఘటనలో చందన, రమ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ దృశ్యం చూసిన వారి 9ఏళ్ల కుమారుడు గట్టిగా కేకలు వేస్తూ బయటకి వచ్చాడు. దీంతో చుట్టు పక్కల వారు వచ్చి ఆ పిల్లవాడిని కాపాడారు. స్థానికులు సమాచారం అందిచడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. నిందితుడు రమణని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -