Great Husband: పది కూడా చదవని భార్యను ప్రేమతో చదివించిన భర్త.. చివరకు?

Great Husband: ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అంటే మాటల్లో చెప్పినంత సులువు కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి పగలు కష్టపడి చదివితేనే ఐఏఎస్ ఐపీఎస్ సాధించగలరు. మనం పట్టుదలతో కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు అంటూ ఇప్పటికే ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు నిరూపించారు. ఇలాంటి కోవకు చెందిన వారే ఐపీఎస్ ఆఫీసర్ అంబికా ఒకరు చెప్పాలి. పదికూడా పాస్ అవ్వని భార్యను ప్రేమతో చదివించి నేడు ఐపీఎస్ గా అందరి పరిచయం చేశారు.


కనీసం పదో తరగతి కూడా చదవని అంబిక ఒకరోజు రిపబ్లిక్ డే రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు వెళ్లారట అక్కడ పోలీస్ అధికారులకు ఇచ్చిన గౌరవం చూసి ఆ గౌరవం తనకి కూడా కావాలని ఈమె మనసులో దృఢంగా అనుకున్నారట.అయితే ఇదే విషయాన్ని కానిస్టేబుల్ అయినటువంటి తన భర్తకు చెప్పడంతో మొదట్లో తన భర్త అంబికను చదివించడానికి వద్దని చెప్పిన ఆమె పట్టుదల చూసి తనను ప్రవేట్ గా పదవ తరగతి పరీక్షలు రాయించి అనంతరం ఇంటర్ డిగ్రీ కూడా పూర్తి చేసేలా ప్రోత్సహించారు.

ఇలా డిగ్రీ పూర్తవుగానే సివిల్స్ కు అంబికా చాలా పట్టుదలతో ప్రిపేర్ అయ్యారు.ఇక తాను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో సరైన కోచింగ్ సెంటర్ లేకపోవడంతో పిల్లలను తన భర్త చూసుకుంటూ ఆమెను కోచింగ్ కోసం చెన్నై పంపించారట. ఇలా మొదటి రెండు ప్రయత్నాలు ఈమెకు నిరాశ ఎదురైనప్పటికీ 2008లో ఈమె ఐపీఎస్ కు సెలెక్ట్ అవడం అనంతరం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకోవడం జరిగింది.

శిక్షణ పూర్తి కాగానే ముంబై నార్త్ డివిజన్ డిసిపి గానియమితులయ్యారు. ఇలా ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఎంతో కష్టపడుతూ అక్రమాలను ఎదిరించి ఈమె ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో పురస్కారాలను కూడా అందుకున్నారు. ఇలా ఈమె పట్టుదలతో జీవితంలో ఎదిగిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -