Balineni: బాలినేని పరువు తీసిన జనసేన కార్పొరేటర్.. అలా కౌంటర్ ఇస్తూ?

Balineni: ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి బాగోలేదని చెప్పవచ్చు. మాజీ మంత్రి అయినా బాలినేని పుట్టెడు కష్టాలలో ఉన్నారు. గత ఏడాది ఆయన మంత్రి పదవి పోయిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో అప్పటినుంచి బాలినేని పరిస్థితి మరింత దారుణంగా మారింది. ముఖంలో కలలేదు. ఏడాది నుంచి అలాగే దిగులుగా గడుపుతున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన కన్నీటి పర్యంతమైన విషయము అనగా తెలిసిందే. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి తోడు విశాఖ నుంచి జనసేన కార్పొరేటర్ గత కొంతకాలంగా విమర్శలు చేస్తూ బాలినేనిని మరింత ఇరుకున పెడుతున్నారు.

బాలినేని వియ్యంకుడు విశాఖలో కాపురం ఉండగా వారిద్దరిపై విమర్శలు గుప్పిస్తూ ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. గతంలో ఆరోపణలు చేసినపుడు బాలినేని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్. కానీ ప్రస్తుతం ఆయన ఆ పదవి పోయి దిగాలుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా ఆ కార్పొరేటర్ బలంగానే విమర్శలు చేస్తున్నారు. జిల్లాలో వందల కోట్ల విలువైన మైనింగ్ అక్రమాల మీద బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమీ లేదని అంటున్నారని, ఉన్నాయని చెప్పడానికి తాను సవాల్ చేస్తున్నానని జనసేన కార్పోరేటర్ మూర్తీ యాదవ్ మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు.

 

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామంలో భూ కబ్జాల పైన నిష్పాక్షిక విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి అంటూ స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలను బ్లాక్ మెయిల్ చేయడం, ఫిర్యాదు దారులను బెదిరించడం మానుకోవాలని ఆయన బాలినేనికి హితవు పలికారు. అసలే బాలినేని ఇబ్బందులో ఉంటే సరైన టైం చూసి జనసేన కార్పోరేటర్ సవాల్ చేశారు అని అంటున్నారు. కార్పోరేటర్ బాలినేనికి సవాల్ విసిరి గట్టిగానే దెబ్బ కొట్టాడని, బాలినేని పరువు తీశాడు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపై జనసేన కార్పొరేటర్ చేసిన ఛాలెంజ్ పై బాలినేని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

 

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -