Minister Roja: వర్షంలో.. రోజా ఇంటి ముందు తొడగొట్టిన జనసేన నేతలు

Minister Roja: ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా ఇంటి ముందు జనసేన నేతలు తొడగొట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నగరిలో రోజా ఇంటి ముGదు తొడగొట్టారు. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ రాయల్ ను బెయిల్ రావడంతో.. రోజా ఇంటి ముందు తొడగొట్టారు. మంత్రి రోజా పట్ల అనుచితంగా మాట్లాడారనే ఆరోపణలతో కిరణ్ రాయల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

తిరుపతి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ గా ఉన్న కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేసి పోలీసులు నగరి కోర్టులో హాజరుపర్చగా.. పోలీసులు 41ఏ నోటీస్ ఇచ్చిన ఆయనను బెయిల్ పై విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరిలో కిర్ రాయల్ నగరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ వర్షం కురుస్తున్నా సరే.. లెక్క చేయకుండా ర్యాలీ చేశారు. మధ్యలో మంత్రి రోజా ఇంటి దగ్గర జనసేన నేతలు తొడగొట్టారు.

 

కిరణ్ రాయల్ తో పాటు పసుపు లేటి హరిప్రసాద్ తో పాటు పలువురు జనసేన వీర మహిళలు ఉన్నారు. అయితే రోజా ఎయిర్ పోర్టులో జబర్దస్త్ షో చేశారని కిరణ్ రాయల్ గతంలో ఆరోపించారు. వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన గుండాలే విశాఖ ఎయిర్ పోర్ట్ లో వారిపై దాడి చేశారంటూ విమర్శలు చేాశారు. రోజాను కించపరుస్తూ మాట్లాడినందుకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా కిరణ్ రాయల్ జనసేనలో కీలక నేతగా ఉన్నారు. మీడియా ఛానెల్స్ లో చర్చలకు వస్తూ జనసేన పార్టీ వాణిని వినిపిస్తోన్నారు. మీడియాలో తన వాయిస్ ను జనసేన తరపున బలంగా వినిపిస్తోన్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -