Kerala: ప్రేమకు నిరాకరించిందని ప్రియురాలిని చంపిన ప్రియుడు

Kerala: ప్రేమ పేరుతో ఈ మధ్యకాలంలో మోసాలు పెరుగుతున్నాయి. ప్రేమిస్తున్నామని అబద్ధాలు చెప్పడం.. ఇద్దరి మధ్యల పెళ్లి వాదన లేదా గొడవ రానంత వరకు సంతోషంగా ఉండటం. చివరి క్షణాల్లో ఇష్టం లేదంటూ విడిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే జరిగిందెదో జరిగిపోయిందని లైట్ తీసుకునే వాళ్లు ఎక్కువ మంది ఉంటే.. ఎలాగైన రివేంజ్ తీసుకోవాలని అనుకునే వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రేమంటే ఎంటో తెలియకుండా కొందరు కిరాతకుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు తనకు బ్రేకప్ చెప్పిందన్న పగతో ప్రియురాలిని దారుణంగా చంపేశాడు. డైరెక్ట్ గా ఆమె ఇంటికే వెళ్లి ఆమెను నరికి చంపాడు.

ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలోని పనూర్‌కు చెందిన విష్ణుప్రియ మనతేరికి చెందిన శ్యామజిత్‌ ప్రేమించుకున్నారు. కొద్ది రోజులపాటు వీరిద్దరి మధ్య ప్రేమ బాగానే కొనసాగింది. అయితే వీరిద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో విష్ణుప్రియ విడిపోవాలని అనుకుంది. శ్యామజిత్‌కు బ్రేకప్ చెప్పి అప్పటి నుంచి దూరంగా ఉంటోంది. విష్ణుప్రియ బ్రేకప్ చెప్పడం శ్యామజిత్‌కు నచ్చలేదు. దీంతో చాలా సార్లు తనని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కానీ విష్ణుప్రియ అతడి మాటలను ఒప్పుకోలేదు. దీంతో పగ పెంచుకున్న శ్యామజిత్.. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు.

అయితే విష్ణుప్రియ ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తుంటుంది. శనివారం యథావిథిగా విష్ణుప్రియ విధులకు వెళ్లింది. అప్పుడే విష్ణుప్రియ బంధువు ఒకరు చనిపోయినట్లు ఆమెకు కాల్ వచ్చింది. దీంతో ఆమె డ్యూటీకి సెలవు పెట్టి ఇంటికి వెళ్లింది. అప్పటికీ విష్ణుప్రియ కుటుంబీకులు చావు ఇంటికి వెళ్లారు. ఇంట్లో విష్ణుప్రియ మాత్రమే ఉంది. ఈ విషయం శ్యామజిత్‌కు తెలిసింది. శ్యామజిత్ డైరెక్ట్‌గా ఇంటికి వెళ్లాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. కోపోధ్రిక్తుడైన శ్యామజిత్.. విష్ణుప్రియను కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -