Sreemukhi: తండ్రితో శ్రీముఖి పెళ్లి అంటూ వార్తలు.. ఏమైందంటే?

Sreemukhi: బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి అందరికీ తెలిసిందే. ఈమె తన మాటలతోనే కాదు డ్యాన్స్ స్టెప్పులతో అందచందాలతో అందర్నీ ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. యాంకర్ సుమ తర్వాత శ్రీముఖి వరుస షోలతో దూసుకుపోతోంది. శ్రీముఖిని బుల్లితెర రాములమ్మ అని కూడా పిలుస్తారు. యాంకరింగ్ లో సత్తా చాటి ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి ఇంకాస్త పాపులారిటీని యాంకర్ శ్రీముఖి సొంతం చేసుకుంది.

 

శ్రీముఖి, రవి షోలు అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు శ్రీముఖి చేసే ప్రతి షోలో ముక్కు అవినాష్ కనిపిస్తుండటం విశేషం. ఇద్దరూ మంచి స్నేహితులు కావడం వల్ల శ్రీముఖి చేసే ప్రతి షోలోనూ ముక్కు అవినాష్ ఉంటాడని పలువురు చర్చించుకుంటున్నాడు. ఇకపోతే సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై అనేక వార్తలు ప్రత్యక్షమవుతుంటాయి. తాజాగా శ్రీముఖిపై కూడా ఓ వార్త వైరల్ అవుతోంది.

 

నెట్టింట తన గురించి వచ్చిన ఆ వార్తకు శ్రీముఖి ఫైర్ అయ్యింది. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా రాస్తున్నారని, దాని వల్ల తాను విసిగిపోయానని తెలిపారు. గతంలో ఓ హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ తో తన పెళ్లి జరుగుతుందని వార్తలు రాశారని, ఆ తర్వాత ఇంకొకరితో పెళ్లి జరిగే సమయం కూడా చెబుతూ వార్తలు రాసుకొచ్చారని తెలిపింది. అలా తనపై వార్తలు రాయడం వల్ల వారికైనా సిగ్గు ఉండాలని శ్రీముఖి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోలో తన తండ్రి ఫోటోను మాత్రమే బ్లర్ చేసి ఇద్దరికి పెళ్లి జరుగుతుందని రాశారని, అలాంటి వార్తల వల్ల తాను చాలా బాధపడినట్లు తెలిపారు. ఇటువంటి వార్తలు రాసేవారికి కొంచెమైనా మానవత్వం ఉందా లేదా అని ఆమె ప్రశ్నించారు. అలాగే తన పెళ్లిపై వస్తున్న వార్తలను ఎవ్వరూ నమ్మొద్దని, తాను ఇప్పట్లో పెళ్లికి సిద్ధంగా లేనని వెల్లడించారు. ప్రస్తుతం షోలు చేస్తున్నానని, ఓ నాలుగైదు సంవత్సరాల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -