Ishan: ఒకే ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత.. వహ్వా ఇషాన్ అంటున్న భారత ఫ్యాన్స్!

Ishan: బ్యాటింగ్ డామినేషన్ టీమిండియాను మారుపేరుగా చెబుతుంటారు. పాకిస్థాన్ జట్టు బౌలింగ్ ఫ్యాక్టరీగా ఎలాగైతే పేరు తెచ్చుకుంటే భారత జట్టుకూ బ్యాటింగ్ కార్ఖానా అనే పేరుంది. పాక్ టీమ్ లో ఎలాగైతే నిఖార్సయిన బౌలర్లు పుట్టుకొస్తారో.. అలాగే భారత జట్టులో కూడా ఒకరి తర్వాత ఒకరు టాలెంటెడ్ బ్యాటర్లు వస్తుంటారు. అలాంటి టీమిండియా బ్యాటింగ్ ఇటీవల పెద్దగా సక్సెస్ కావడం లేదు. అయితే చాన్నాళ్ల తర్వాత మన బ్యాటర్ల సత్తా ఏంటో కనిపించింది.

 

బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన ఆఖరి వన్డేలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతోపాటు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ రెచ్చిపోయారు. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదల బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకంగా 409 పరుగులు చేసింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత భారత స్కోరు బోర్డు బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది. డబుల్ సెంచరీ చేసి ఔటయ్యేదాకా ఇషాన్ బౌండరీలు, సిక్సులు బాదుతూనే ఉన్నాడు. మొత్తం స్కోరు బోర్డులో సగం రన్స్ ఇషాన్ వే కావడం విశేషం. అయితే తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మార్చిన ఇషాన్ కిషన్.. ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో ఏకంగా 10 సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.

ధోని రికార్డు కూడా బ్రేక్..!

బంగ్లాతో ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ అద్వితీయమనే చెప్పాలి. ఈ ఇన్నింగ్స్ ద్వారా వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్ గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు. ఇంతకంటే ముందు సచిన్, సెహ్వాగ్, రోహిత్ ఈ ఫీట్ ను అందుకున్నారు. వన్డేల్లో మన జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసిన వికెట్ కీపర్ కూడా ఇషానే. అంతకుముందు ధోనీ (183) పేరిట ఈ రికార్డు ఉండేది. బంగ్లాదేశ్ లో ఆ జట్టుపై 2011లో షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) 185 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇప్పుడు దాన్ని కూడా ఇషాన్ బ్రేక్ చేశాడు. బంగ్లాపై అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్ గా నిలిచాడు.

ఫాస్టెస్ట్ 150 కొట్టేశాడు

బంగ్లాతో మూడో వన్డేలో 10 సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్.. 2000లో సచిన్, బంగ్లాదేశ్ జట్టుపై 7 సిక్సులు బాదిన రికార్డును కూడా తుడిపేశాడు. వన్డేల్లో తొలి శతకాన్ని అత్యధిక వ్యక్తిగత స్కోరుగా మార్చిన బ్యాటర్ గా ఇషాన్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు ముందు లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్.. తొలి సెంచరీని 175 పరుగులుగా చేసి నాటౌట్ గా నిలిచాడు. 103 బంతుల్లో 150 స్కోరు దాటిన ఇషాన్.. అత్యంత వేగంగా 150 ప్లస్ స్కోరు చేసిన భారత బ్యాటర్ గా ఘనత సాధించాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్.. 112 బంతుల్లో 150 ప్లస్ స్కోరు చేశాడు.

బంగ్లాదేశ్ లో అతి చిన్న వయసులో 50 ప్లస్ స్కోరు చేసిన భారత క్రికెటర్ గా ఇషాన్ కిషన్ నిలిచాడు. తద్వారా గంభీర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. గంభీర్.. 21 ఏళ్ల 184 రోజుల్లో బంగ్లాలో 50 ప్లస్ చేసిన ఓపెనర్ కాగా.. ఇషాన్ కిషన్ 24 ఏళ్ల 145 రోజుల్లో ఈ మార్క్ ను క్రాస్ చేశాడు. టీమిండియా ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఇషాన్ కిషన్ రికార్డు నెలకొల్పాడు. 1999 ప్రపంచ కప్ లో సౌరవ్ గంగూలీ 183 పరుగులతో క్రియేట్ చేసిన ఘనతను ఇప్పుడు బ్రేక్ చేశాడు. ఒక్క డబుల్ సెంచరీతో ఇషాన్ ఏకంగా ఇన్ని రికార్డులు నెలకొల్పడం గొప్పేనని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -