Hyderabad: నాలుగేళ్ల చిన్నారిపై అలాంటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి.. చివరికి?

Hyderabad: రాను రాను దేశవ్యాప్తంగా ఆడవారికి రక్షణ అన్నది కరవుతుంది. స్త్రీలు ఇల్లు విడిచి బయటకు వెళ్లాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. నాలుగేళ్ల చిన్నారి నుంచి 90 ఏళ్ల వృద్ధురాలు వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు కామాంధులు. ప్రభుత్వాలు కామందుల పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. నిత్యం దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు వావి వరసలు చిన్న పెద్ద అని తేడా మరిచి దారుణాలకు ఒడిగడుతున్నారు.

మరికొందరు అత్యాచారం చేసి ఆపై హత్యలు చేసే చంపేస్తున్నారు. దారుణంగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ లోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటయ్య అనే 40 ఏళ్ళ వ్యక్తి గత కొద్దీ రోజులుగా శంషాబాద్ నగరంలోని ఒక ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రైవేట్ లేబర్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే కార్మికులు అందరూ శంషాబాద్ లోని ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరితో పాటు కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తులు కూడా నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం రాత్రి వెంకయ్య పీకలదాక మద్యం సేవించి తాను నివాసం ఉండే చోటుకు వచ్చాడు.

 

ఈ క్రమంలోనే ఈ దుర్మార్గుడు వీరి గుడిసె పక్కల నివాసం ఉంటున్న ఓ 4 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు. ఎలాగైన ఆ చిన్నారిని అత్యాచారం చేయాలని భావించి అనుకున్నదే ఆలస్యం ఆ బాలికపై వెంకయ్య అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తున్న సమయంలో ఆ బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో ఆ చిన్నారి తల్లి పరుగు పరుగున వచ్చి ఆ రాక్షసుడి చెర నుంచి తన బిడ్డను కాపాడుకుంది. వెంటనే జరిగిన దారుణంపై ఆ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ దారుణానికి పాల్పడిన వెంకయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -