Komati Reddy brothers: రాజకీయంగా ప్రమాదంలో పడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్.. కెరీర్ క్రోజ్ అయినట్లేనా?

Komati Reddy brothers: తెలంగాణలో హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనున్నాయి. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మునుగోడు ఉపఎన్నిక ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఉపఎన్నికల గెలుపు ప్రభావం పార్టీలన్నింటిపై ఉంటుంది. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ప్రజల్లో మరింత మైలేజ్ పెరుగుతోంది. మునుగోడు ఉపఎన్నికను పార్టీలన్నీ సెమీ ఫైనల్ గా భావించడంతో.. ఈ సెమీ ఫైనల్ లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ఫైనల్ గా భావించి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసొస్తుంది. అందుకే పార్టీనల్నీ ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాయి.

 

ఈ నెల 6వ తేదీన వచ్చే మునుగోడు ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో 6వ తేదీన ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ వైపే ఉండగా.. ప్రజల తీర్పు సర్వే సంస్థల అంచనాలకు తగ్గట్లు ప్రతిబింబిస్తుందా.. లేదా అనేది ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజం అవ్వాలని లేదు. చాలా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ తలక్రిందులయ్యాయి. దుబ్బక ఉపఎన్నికల సమయంలో కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చాలా సర్వే సంస్థలు అంచనా వేశాయి. కానీ చివరికి అక్కడ రఘునందర్ నావు స్వల్ప మెజార్టీతో గెలవడంతో.. సర్వే సంస్థల అంచనాలు తలక్రిందులయ్యాయి.

 

ఒకవేళ టీఆర్ఎస్ ఓడితే.. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడంతో టీఆర్ఎస్ కు బోనస్ అని చెప్పవచ్చు. అయితే రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఓడిపోతే ఆయనకు ఇక చిక్కులే అని చెప్పవచ్చు. రాజకీయంగా ఆయన భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలన రఘునంద్ రావు, ఈటల రాజేందర్ కే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పేరుకు మాత్రమే వారిద్దరు ఎమ్మెల్యేలుగా ఉండగా.. వారిని అంతగా విలువ ఇవ్వడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నే బీజేపీలో కీలకంగా ఉన్నారు. వారి కనుసన్నల్లోనే పార్టీ నడుస్తోంది.

 

గెలిచిన ఎమ్మెల్యేలకు బీజేపీలో ప్రాధాన్యత దక్కనప్పుడు.. ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డిని బీజేపీ పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి రావడానికి కోమటిరెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు బాగా ప్రచారం జరిగింది. ఒక మీడియా ఛానెల్ లో కూడా ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డి బయటపెట్టారు. తమ కంపెనీకి చిన్న కాంట్రాక్ట్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆయన ఓడిపోతే ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేసే అవకాశముందనే ప్రచారం జోరుగా జరుగతోంది. దీని వల్ల ఆర్ధికంగా, రాజకీయంగా రాజగోపాల్ రెడ్డికి చక్కుల్లో పడే అవకాశముందని అంటున్నారు.

 

ఇక తమ్ముడికి సపోర్ట్ చేసినందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజకీయంగా ఇబ్బందులు ఎదర్కొనే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ వెంకటరెడ్డి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. తాను ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయకుండా బీజేపీ తరపున పోటీలోకి దిగిన రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డి ప్రచారం చేశారు. పలువురి కాంగ్రెస్ నేతలకు ఆయన ఫోన్లు చేసి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని, తన తమ్ముడికి మద్దతు ఇవ్వాలని కోరారు.

 

అలాగే మునుగోడులో తాను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదని అంటూ వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయనకు ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తోన్నారు. దీంతో వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలవకపోవడం, వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడం జరిగితే.. అన్నతమ్ముడికి రాజకీయంగా ఇక ఇబ్బందులు ఎదుర్కొవ తప్పదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -