మొదటి రాత్రి భార్యాభర్తలు ఓకే గ్లాసులో పాలు తాగడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?

మన హిందూ సంప్రదాయాలు ప్రకారం పెద్దవారు చెప్పే ప్రతి పని వెనుక ఏదో ఒక సైన్స్ ఉంటుంది. అయితే వీటిని సరైన పద్ధతిలో పాటించడం లేదని వాటిని సాంప్రదాయాలుగా పెట్టి ఇప్పటికీ ఆ సాంప్రదాయాలను పాటించేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.వివాహంలో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది.

ఇలా మాంగల్య ధారణకు సరైన ముహూర్తాన్ని ఎలా నిర్ణయిస్తారు. మొదటి రాత్రికి కూడా మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. అయితే మొదటి రాత్రి రోజు భార్య భర్త దగ్గరకు పాల గ్లాసు తీసుకువెళ్లే సంప్రదాయం ఉంది అయితే ఇలా మొదటి రోజు రాత్రి మాత్రమే ఇలా పాల గ్లాసుతో నవవధువు వరుడు గదిలోకి వెళ్లడానికి గల కారణం ఏంటి అనే విషయానికి కూడా ఓ కారణం ఉంది.

వివాహం అనేది ఓ పవిత్రమైన బంధం ఈ బంధం పది కాలాలపాటు మరింత గట్టిగా ఉండాలంటే భార్యాభర్తలిద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉండాలి. ఇలా ఈ అన్యోన్యత మొదటి రోజు రాత్రి మరింత బలపడుతుందని చెప్పాలి.అయితే మొదటి రోజు రాత్రి వధూవరులు ఇద్దరు అలసిపోయి ఉంటారు కనుక వారిలో శక్తినింపడానికి పాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే పాలలో కుంకుమపువ్వు కలిపి ఇవ్వడం జరుగుతుంది.

ఇలా పాలలో కుంకుమ పువ్వు రేకలు కలపడం వల్ల మరింత అదనపు శక్తి రావడమే కాకుండా ఈ కుంకుమ పువ్వులో ఉండే లక్షణాలు కామోద్దీపనను కలిగిస్తాయి. పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్‌తో కుంకుమ రేకలు కలిసి జీవశక్తి మెరుగుపడి కొత్తగా పెళ్లయిన వారికి ఒత్తిడిని తగ్గించడంలో దోహదపడుతుంది. ఈ ఒక్క కారణంతోనే పెళ్లయిన మొదటి రోజు వధువు పాల గ్లాసుతో వరుడు గదిలోకి వెళ్తుంది. అయితే పూర్వకాలం పాలలో కుంకుమ పువ్వు కల్పించేవారు. ప్రస్తుతమైతే కేవలం పాల గ్లాసుతో మాత్రమే శోభనపు గదిలోకి వెళ్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -