Actress Ankita: సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి అవకాశాలను అందుకొని తమ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో కొన్ని చెడు అలవాట్లకు బానిసలుగా మారి తమ కెరియర్ ను పాడు చేసుకుంటూ ఉంటారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తమ కెరియర్ను పాడు చేసుకున్నారు. ఇలాంటి వారిలో నటి అంకిత ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాజమౌళి వంటి దర్శకుల సినిమాలలో నటించి ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నటి అంకిత గురించి అందరికీ తెలిసిందే.
ముంబైలో పుట్టి పెరిగిన అంకిత తల్లిదండ్రులు బిజినెస్ చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే అంకితన సైతం బిజినెస్ రంగం వైపు నడిపించాలని తల్లిదండ్రులు భావించారు. అయితే అంకిత మాత్రం ఎవరూ ఊహించని విధంగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. చిన్నప్పుడు రస్నా యాడ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంకిత అనంతరం పలు యాడ్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఓసారి ఓ సినిమా పని నిమిత్తం వైవిఎస్ చౌదరి ముంబై వెళ్ళగా అక్కడ అంకితను చూసి ఆశ్చర్య పోయారట.
ఈ క్రమంలోనే తనకు లాహిరి లాహిరి లాహిరిలో సినిమా అవకాశాన్ని కల్పించి ఆమెను హీరోయిన్గా పరిచయం చేశారు.ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి అంకిత తన అందచందాలతో నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వంటి డైరెక్టర్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.ఈ క్రమంలోనే సింహాద్రి సినిమా ద్వారా అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఈమె అనంతరం చెడు వ్యసనాలకు బానిసగా మారారు.
ఇలా స్మోకింగ్ డ్రింకింగ్ కి బాగా అలవాటు పడిన అంకితం రాత్రి అయితే మూడు పెగ్గులు లేనిదే నిద్రపోయేది కూడా కాదు. అంతలా చెడు వ్యసనాలకు బానిస కావడంతో క్రమక్రమంగా ఈమె అనారోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఇలా అనారోగ్యం పాలవడంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన అంకితను తన తల్లిదండ్రులు రిహాబిటేషన్ సెంటర్లో చేర్పించి తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనకు పెళ్లి చేశారు. అయితే ఆమె చెడు వ్యసనాలే తనని ఇండస్ట్రీకి దూరం చేశాయని చెప్పాలి.