Samantha: యశోదకు పబ్లిసిటీ జరగాలనే సమంత వ్యాధిని బయటపెట్టిందా?

Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత లేటెస్ట్ గా తనకున్న జబ్బు గురించి బయట పెట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంతకుముందే సమంత సీరియస్ హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతోందన్న వార్త దావానలంలా నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై ఆమె మేనేజర్ వివరణ కూడా ఇచ్చారు. అయితే, అంతటితో గాసిప్స్ ఆగిపోలేదు. తాజాగా సమంత నటించిన చిత్రం యశోద విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచారం నేపథ్యంలో సమంత తనకున్న జబ్బు గురించి ఇన్ స్టా గ్రామ్ వేదికా పంచుకుంది.

అయితే, సమంత ఈ సమయంలో తన జబ్బు గురించి, ట్రీట్ మెంట్ గురించి బయట పెట్టడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. యశోద సినిమా పబ్లిసిటీ కోసమే సమంత ఈ సమయంలో ఇలా చేసిందనే వాదన వినిపిస్తోంది. యశోద మూవీకి హెల్త్ ఇష్యూ వల్ల ప్రచారం కలుగుతుందని భావించి ఆమె ఈ విధంగా ఆరోగ్య సమస్యను బయటపెట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే, సమంత ఇచ్చిన క్లారిటీ కాస్త ఆందోళన కరంగానే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

నయమయ్యే జబ్బేనా? కాదనే సమాధానం వస్తోందా?

సమంత తాను మయోసిటిస్ అనే జబ్బుతో బాధ పడుతున్నానని తెలిపింది. కొంత కాలం చర్మ సమస్య అని, మరో సమస్య అనీ, చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చిందన్న గాసిప్స్ నేపథ్యంలో తాను తన జబ్బు గురించి బయట పెడుతున్నట్లు చెప్పింది సమంత. చేతికి డ్రిప్ కనెక్షన్ తో ఓ ఫొటో ఇన్ స్టాలో పెట్టి వివరణ ఇచ్చింది సమంత. అయితే, మయోసిటిస్ అనేది నయం అయ్యే వ్యాధేనా అంటే కొంచం అనుమానమే అనే సమాధానం వినిపిస్తోంది.

మయోసిటిస్ జబ్బు నయం కావడానికి కాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. మెడికల్ మేనేజ్ మెంట్ ద్వారా నెమ్మదిగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మనిషి శరీరం కదలికలకు సహకరించే కండరాలకు ఇన్ ఫ్లమేషన్ రావడం వల్ల వచ్చే ఇబ్బందులే ఈ జబ్బుకు కారణంగా చెబుతున్నారు. ఇది సోకడం వల్ల మనిషికి త్వరగా నీరసం వచ్చేస్తుంది. కదలికలు, నడవడం కష్టంగా మారుతుంది. దీనిపై మరింత అవగాహన రావాల్సి ఉంది. సమంత విడాకుల తర్వాత నెగిటివ్ పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కొంటోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -