Krishnam Raju: కృష్ణంరాజుకు రెబల్ స్టార్ అనే బిరుదు రావడానికి కారణం ఇదే!

Krishnam Raju: టాలీవుడ్ ప్రేక్షకులకు రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తొలిసారిగా ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ విలన్ గా కూడా అప్పటి ప్రేక్షకులను బాగానే మెప్పించాడు. ఆ తర్వాత పలు సినిమాలో హీరోగా నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు కృష్ణంరాజు.

అలా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా ఓ వెలుగు వెలిగాడు. అటువంటి మనిషి ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయాడు. అనారోగ్య సమస్యతో ఆయన చనిపోవడం సినీ రాజకీయ వర్గాలు ఏమాత్రం తీసుకోలేకపోతున్నాయి. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఇక కృష్ణంరాజు 1968 లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన నేనంటే నేనే సినిమాలో విలన్ పాత్ర పోషించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత హీరోగా జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్తకన్నప్ప, సావిత్రి, మన వూరి పాండవులు సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు కృష్ణంరాజు. ఆపై కటకాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, మరణ శాసనం, పలనాటి పౌరుషం లాంటి రెబలియన్ పాత్రలను చేయడంతో ఇండస్ట్రీలో కృష్ణంరాజు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇతడిని రెబల్ స్టార్ అని పిలవడం స్టార్ట్ చేశారు.

అటువంటి నటుడు ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చనిపోయాడు. 83 సంవత్సరాలు కలిగిన కృష్ణంరాజు అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనుకోకుండా మరణించాడు. ఇక కృష్ణంరాజు మరణ వార్త తెలియడంతో తన అభిమానులంతా కన్నీటి శ్లోకంలో మునిగి పోయారు. ఇక రాజకీయ, సినీ ఇండస్ట్రీ వర్గాలు కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఏదైనా అటువంటి గొప్ప నటుడు చనిపోవడం సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా మారిపోయింది. ప్రస్తుతం పలువురు సెలబ్రేటీలు కృష్ణంరాజు కుటుంబీకులను పరామర్శిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -