Chiranjeevi: చిరు సినిమా కథ అంతేనా..నెట్టింట అనేక కథలు వైరల్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాను యువ దర్శకుడు బాబీ డైరెక్ట్ చేశాడు. సినిమాలో చిరంజీవికి జోడీగా శృతిహాస‌న్ సందడి చేశారు. అంతే కాకుండా ఈ సినిమాలో ర‌వితేజ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీలో చిరంజీవి ఊర‌మాస్ లుక్ లో కనిపించి అందరిలో ఫుల్ జోష్ నింపారు. దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు మ్యూజిక్ ను అందించారు.

 

ఇప్ప‌టికే ఈ సినిమా నుండి పార్టీ సాంగ్ విడ‌ద‌ల అయ్యి అందర్నీ షేక్ చేస్తోంది. ఎక్క‌డ చూసినా బాస్ పార్టీ పాట‌నే వినిపిస్తూ సందడి చేస్తోంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 13వ తేదిన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి మిలియన్ల వ్యూవ్స్ తో దూసుకెళ్తోంది.

 

వాల్తేరు వీరయ్య సినిమా ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఫ్యాన్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారని చెప్పొచ్చు. ఈ సినిమా ట్రైల‌ర్ చూసిన త‌ర‌వాత ట్రోలర్స్ కూడా సినిమా స్టోరీ ఇదేనని పలు రకాల కథలను వినిపిస్తున్నారు. వాల్తేరు వీర‌య్య ట్రైల‌ర్ లో ప్ర‌కాష్ రాజ్ డ్యూయ‌ల్ రోల్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మెయిన్ విల‌న్ గా డాన్ గా ప్ర‌కాష్ రాజ్ కనిపిస్తుండగా ఓ షాట్ లో ప్రకాష్ రాజ్ చిరు పక్కన కూడా కనిపించడం గమనించవచ్చు.

 

అంటే చిరు బ్యాచ్ లో ఓ మెంబ‌ర్ లో అతను కనిపించడం, మరో వైపు ట్రైల‌ర్ లో చిరంజీవి వీడు నా ఎర నువ్వే నా సొర‌ అంటూ డైలాగ్ చెప్పడంతో కథ తెలిసిపోతోందని నెటిజన్లు అంటున్నారు. త‌న బ్యాచ్ లోని ప్ర‌కాష్ రాజ్ పంపించి వీర‌య్య డాన్ ప్రకాష్ రాజ్ ను పట్టుకుంటాడని ట్రోలర్స్ తమదైన శైలిలో కథను వినిపిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి ఉండాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -