Viral: ఆన్సర్ షీట్ లో పాటలు రాసిన స్టూడెంట్.. ఏయే పాటలంటే?

Viral: ఈ మధ్యకాలంలో విద్యార్థులు చేసే పనికి టీచర్లే ఆశ్చర్యపోతున్నారు. విద్యార్థులు చదువు చెప్పిన ఉపాధ్యాయుల కంటే తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో అటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మామూలుగా విద్యార్థులకు చదువులు చెప్పి ఆ తర్వాత పరీక్షలు పెట్టడం అన్నది కామన్. ఇక పరీక్షల్లో చదువుకున్న సంబంధించిన ప్రశ్నలకు సరైన ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. చాలామంది వాటికి ఆన్సర్ తెలియక ఏవేవో పిచ్చి పిచ్చి సమాధానాలు రాస్తూ ఉంటారు.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక స్టూడెంట్ చాలా తెలివిగా ప్రవర్తించి సినిమాల పేర్లు రాయడంతో పాటు తన టీచర్ ని పొగిడే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చండీగఢ్ యూనివర్శిటీకి చెందిన ఒక విద్యార్థి, పరీక్ష ఆన్సర్ షీట్ కి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పరీక్షల్లో సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానంగా విద్యార్థి రాసిన సమాధానాల కారణంగా వైరల్ అయ్యింది. స్టూడెంట్ కేవలం మూడు ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే రాశాడు వాటిలో రెండు ప్రశ్నలకు గాను రెండు హిందీ సినిమా పాటలు రాశాడు.

 

మొదటి ప్రశ్నకు సమాధానంగా అమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా త్రీ ఇడియట్స్ చిత్రం నుండి గివ్ మీ సమ్ సన్‌షైన్, గివ్ మి సమ్ రెయిన్.. గివ్ మి అదర్ ఛాన్స్..ఐ వాన్నా గ్రో అప్ వన్స్ ఎగైన్ అనే పాటను రాయగా మూడో ప్రశ్నకు సమాధానం గా పీకే మూవీ నుంచి భగవాన్ హై కహాన్ రే తూ పాటను రాశాడు. ఇక రెండవ ప్రశ్నకు సమాధానంగా విద్యార్థి తన క్లాస్ టీచర్ కు ఓ సందేశాన్ని రాశాడు.. మేడమ్, మీరు తెలివైన ఉపాధ్యాయులు, నేను కష్టపడి పని చేయలేకపోవడమే నా తప్పు, దేవుడా నాకు కొంత ప్రతిభను ఇవ్వు అంటూ దేవుడిని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ మేడం ని కూడా రిక్వెస్ట్ చేసినట్టు రాశాడు. అయితే ఆ స్టూడెంట్ కు టీచర్ జీరో మార్కులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోని చూసిన ని నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -