Krishna-Indira Devi: హీరో కృష్ణ, ఇందిరా దేవిల విడాకుల గురించి అసలు విషయం ఏంటో తెలుసా?

Krishna-Indira Devi:  తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు సూపర్ స్టార్ కృష్ణ. ఇక కృష్ణ గారు తన మేనమామ కూతురైనటువంటి ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నారు.

పెళ్లయిన తర్వాత కృష్ణ గారికి సినీ అవకాశాలు బాగా వచ్చేవి. ఆ క్రమంలో దర్శకురాలు , నిర్మాత అయినటువంటి విజయనిర్మల కృష్ణ గారికి మంచి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇక ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కృష్ణ గారు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే విజయనిర్మలను పెళ్లి చేసుకున్నాడు. ఇక మొదట ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ.. తర్వాత తన రెండవ పెళ్లి సంగతి గురించి ఇంట్లో వాళ్లందరికీ తెలిపారు కృష్ణ.

ఈ విషయం తెలిసిన ఇందిరా దేవి గారు గదిలోకి వెళ్లి చాలా గంటల పాటు బయటకు రాలేదట. ఆ తర్వాత బయటకు వచ్చిన ఇందిరా దేవి తన బిడ్డలను దగ్గరికి తీసుకొని బాధపడిందట. కానీ కృష్ణను పల్లెత్తు మాట కూడా అనలేదట. ఇక కుటుంబ సభ్యులను కూడా ఇందిరా దేవి గారు ఏమాత్రం ప్రశ్నించలేదట. అలా కొంతకాలం తర్వాత ఇందిరా దేవి గారు కృష్ణ గారి రెండవ వివాహన్ని అంగీకరించారు.

అంతేకానీ వీరిద్దరు విడాకుల కారణంగా ఎప్పుడు విడిపోలేదు. కాగా నిన్న అనగా సెప్టెంబర్ 28న ఇందిరా దేవి గారు కొన్ని అనారోగ్య కారణాలవల్ల తన ఇంటిలోనే మరణించారు. ఈ విషయం తెలిసి సినీ రాజకీయ వర్గాలు ఒక్కసారిగా మూగబోయాయి. ఇక మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికీ కూడా జర్నించుకోలేకపోతున్నారు. ఏదేమైనా ఘట్టమనేని కృష్ణ గారి ఇంట్లో తీవ్రమైన విషాదం నెలకొంది. ఇక కొంతకాలం క్రితం ఘట్టమనేని రమేష్ బాబు కూడా మరణించారు.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -