Rangareddy: ప్రియుడు ఆ మాట అన్నాడని ఆత్మహత్యకు పాల్పడిన యువతీ?

Rangareddy: ప్రస్తుత సమాజంలో యువత ప్రేమ అన్న ఊబిలో కూరుకుపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు తప్పు దోవలో నడుస్తున్నారు. అంతేకాకుండా ప్రేమించిన యువతి కోసం ప్రియుడు, ప్రేమించిన ప్రియుడు కోసం యువతీ ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేసి తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. బాగా చదివి మంచి ప్రయోజకులు అవుతారు అనుకుంటున్నా కొడుకు కుమార్తెలు ఆ విధంగా చూసి కన్న తల్లిదండ్రులు కూడా గుండెలు విలసేలా రోధిస్తున్నారు.

 

తాజాగా అటువంటి ఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొంగరకలాన్‌ తండాకు చెందిన అంగోతు సరిత, అంతిరాం దంపతుల రెండో కుమార్తె పల్లవి అనే 21 ఏళ్ల యువతి వండర్‌లాలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఎప్పటిలానే గురువారం విధులకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అదే రోజు రాత్రి 11 గంటలకు ఆదిభట్ల పోలీసులకు పల్లవి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆమె జాడకోసం పోలీసులు ఎంత గాలించినా తెలియరాలేదు. శుక్రవారం ఉదయం కొంగరకలాన్ సమీపంలోని ఓ వెంచర్లో చెట్టుకు చున్నీతో ఉరివేసుకున్న స్థితిలో యువతి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆ మృతదేహాన్ని పల్లవిదిగా గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే పల్లవి మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పల్లవికి మూసాపేటకు చెందిన ఎలుక క్రాంతి అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసిందని ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట. అయితే, వండర్‌లాలో పనిచేస్తున్న ప్రణయ్‌తో పల్లవి చనువుగా ఉంటోందని, ఫోన్‌లు, చాటింగ్‌ చేస్తోందని క్రాంతికి అనుమానం వచ్చి అదే విషయమై ఇద్దరి మధ్య రెండు నెలలుగా గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో క్రాంతి గురువారం పల్లవిని కలిసి బైక్‌పై సాయిబాబా గుడి వద్దకు తీసుకెళ్లాడు. మరోసారి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో క్రాంతి నీ బాగోతం అంతా నాకు తెలుసు.. అందరికీ చెప్పి పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన పల్లవి..ఐ లవ్‌యూ.. లాస్ట్‌ మెసేజ్‌ అని క్రాంతికి వాట్సాప్‌ చేసింది. అనంతరం శివారు పరిధిలోని ఓ వెంచర్లో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -