Eluru: అదిరిపోయే శుభవార్త చెప్పిన యువతి.. అమ్మాయిలా మారి అలా చేశానంటూ?

Eluru: సాధారణంగా మన సమాజంలో ఆడవారికి మగవారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అలాగే గౌరవ మర్యాదలు కూడా ఇస్తారు. కానీ ఒక ట్రాన్స్ జెండర్ కి మాత్రం ఎలాంటి గౌరవ మర్యాద ఇవ్వరు.అయితే వారు ట్రాన్స్ జెండర్ కావాలని మారలేదని అది దేవుడు ఇచ్చిన లోపం కారణంగా ఇలా ట్రాన్స్ జెండర్ గా మారిపోతూ ఉంటారు. అయితే ఒక ట్రాన్స్ జెండర్ అంటే సమాజంలో చాలా చిన్న చూపు ఉంది. ఇక ఇదే విషయాన్ని ఎంతో మంది ట్రాన్స్ జెండర్లు బహిరంగంగా చెబుతూ వారి బాధను బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి.

ట్రాన్స్ జెండర్ అయినంత మాత్రాన వాళ్ళు దేనికి పనికిరారని చాలామంది భావిస్తుంటారు కానీ తాజాగా ఏలూరుకు చెందిన ఒక ట్రాన్స్ జెండర్ మాత్రం తన కొడుకులు కూడా చేయలేని పనిని తాను చేసిన నిరూపించి తల్లిదండ్రులకే గర్వకారణంగా మారింది.తనకు ఇద్దరు తప్పులు కాగా తాను లోపం కారణంగా ట్రాన్స్ జెండర్ గా మారిపోయానని తెలిపారు. అయితే తాను ట్రాన్స్ జెండర్ అని తెలియగానే తన తల్లిదండ్రులు తనని దూరం పెట్టారని తెలిపారు.

 

ఇలా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులు తనని దూరం పెట్టారని అయితే తమ చుట్టాలు బంధువులందరూ ఇది తాను చేసుకున్నది కాదు భగవంతుడు ఇచ్చిన లోపం కారణంగా తన ఇలా మారిపోయారు అని చెప్పడంతో అప్పుడు తన తల్లిదండ్రులు తనని చేర తీసారని తెలియజేశారు. మొదట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లడానికి చాలా భయపడేదాన్ని నలుగురు నన్ను వివిధ రకాలుగా మాట్లాడేటమే కాకుండా తన తల్లిదండ్రులను అవమాన పరుస్తారని ఉద్దేశంతో వెళ్లే దాన్ని కాదు రాత్రి వెళ్లి అమ్మ వాళ్ళని చూసుకొని రాత్రి వచ్చేదాన్ని అంటూ తెలిపారు.

 

ఇక ప్రస్తుతం మా చుట్టాలు కూడా మారిపోయారు. ఏదైనా ఫంక్షన్లు జరిగినా తనని ఆహ్వానిస్తున్నారని తెలిపారు.ఇక ప్రస్తుతం తన తల్లిదండ్రుల బాధ్యత తన ఇద్దరి తమ్ముళ్ల బాధ్యత తానే చూసుకుంటున్నానని తమ్ముళ్ళని ఇద్దరిని చదివిస్తున్నానని తెలిపారు. అలాగే తమ తల్లిదండ్రుల కోసం సొంత ఇంటిని కూడా నిర్మించి ఇచ్చానని తెలిపారు.కొడుకుగా తన తల్లిదండ్రుల కోరిక నెరవేర్చలేని తాను కూతురిలా మారిపోయి తన తల్లిదండ్రుల కోరిక నెరవేర్చి వారికి సొంత ఇంటిని కానుకగా ఇచ్చానని చెబుతూ ట్రాన్స్ జెండర్ సంతోషం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -