Theft: లాడ్జిలో యువకుడిని తెలివిగా బురిడీ కొట్టించిన కిలాడీ?

Theft: దేశవ్యాప్తంగా రోజు రోజుకి దొంగతనాలు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ అమాయకమైన వారిని అలాగే అవకాశాలను ఆసరాగా తీసుకుని బురిడీ కొట్టించి దొంగతనాలకు పాటుపడుతున్నారు. తాజాగా ఏపీలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. బస్సులో అందమైన మహిళతో పరిచయం పెంచుకున్న యువకుడు ఆమెతో కలిసి లాడ్జికి వెళ్ళగా చివరికి అతడిని దారుణంగా మోసం చేసి తప్పించుకు వెళ్ళింది కిలాడి. అసలేం జరిగిందంటే.. ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళ, హైదరాబాద్ కు చెందని ఓ యువకుడు ఇద్దరు ఇటీవల ఓ బస్సులో ప్రయాణిస్తున్నారు.

 

పక్కసీటులో ఉన్న మహిళ ఆ యువకుడిని పరిచయం చేసుకుంది. కొద్దిసేపు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఆమె విషయాలు ఆయనకు చెప్పడం, ఆయన విషయాలు ఆమెకు చెప్పుకుంటూ ఒక గంటపాటు వారు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ మహిళ ఎర్రగా, బుర్రగా ఉండడంతో ఆ యువకుడు కాస్త టెంప్ట్ అయ్యాడు. ఆమె కూడా యువకుడి నెగిటివ్ పాయింట్ కనిపెట్టింది. అలా వారి గంట పరిచయంతో ఇద్దరు చాలా దగ్గర మేము మాత్రమే కాకుండా చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉన్నవారిలా మాట్లాడుకుంటున్నారు. దానిని ఆసరాగా తీసుకున్న ఆ మహిళ ఆ యువకుడిని శ్రీకాళహస్తిలోని ఒక లాడ్జికి తీసుకెళ్ళింది.

 

ఇక యువకుడు కూడా ఆ మహిళ వెంటే లాడ్జికి వెళ్ళాడు. ఆ తర్వాత లాడ్జిలో రూమ్ తీసుకుని రూమ్ లోకి వెళ్లిన తర్వాత ఆ మహిళ తెలివిగా ఆలోచించి అతని దగ్గరే ఉన్నా ప్రసాదంలో అతనికి తెలియకుండా మత్తుమందు కలిపి ఇచ్చింది. ఆ మహిళ ప్లాను అర్థం కాక ఆ యువకుడు అలాగే తినేసాడు. కొద్దిసేపటికి అతడు మత్తులోకి జారుకోవడంతో ఆ మహిళ అతని వద్ద ఉన్న రూ.20 వేల నగదు, 7 తులాల బంగారం ఒక ఫోన్, దోచుకెళ్లి అక్కడి నుంచి పరారైంది. మత్తులో నుంచి తిరుకున్న యువకుడు ఆ మహిళ తనను మోసం చేసి తన బంగారు డబ్బు మొబైల్ అని లాక్కుని వెళ్ళింది అని అర్థం చేసుకున్నాడు. ఆ యువకుడు చేసేది ఏమీ లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -