Thegimpu: యాక్షన్ తో అదరగొట్టిన కోలీవుడ్ హీరో అజిత్.. కానీ?

Thegimpu: విడుదల తేదీ : జనవరి 11, 2023

నటీనటులు : అజిత్,మంజు వారియర్,సముద్రకని, జాన్ కొక్కెన్, వీర, బక్స్ మరియు ఇతరులు

దర్శకత్వం : హెచ్.వినోద్

నిర్మాణం : జి స్టూడియోస్ మరియు బోణీకపూర్

సంగీతం : గిబ్రాన్

సినిమాటోగ్రఫీ : నిరవ్ షా

ఎడిటర్ : విజయ్ వెల్లికుట్టి

అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ్ మూవీ తూనీవు కు తెలుగు వెర్షన్ గా రిలీజ్ అయినదే తెగింపు. బోనీ కపూర్ నిర్మాతగా ,హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద అటు తమిళనాడులో ఇటు తెలుగు నాడులో భారీగానే అంచనాలు ఉన్నాయి.మంజు వారియర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది
మరి ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

 

కథ:
ఈ మూవీలో అజిత్ కు చాలా పేర్లు ఉన్నాయి.డార్క్ డెవిల్, చీఫ్‌, మైఖేల్ జాక్సన్ ఇలా పలు రకాల పేర్లతో కథ ముందుకు సాగుతుంది. అజిత్ మరియు మంజు ఇంకొంతమందితో కలిసి ఒక గ్యాంగ్ లా ఏర్పడతారు. వారి వద్ద లేటెస్ట్ టెక్నాలజీ వెపన్స్ కూడా ఉంటాయి. వీళ్లంతా కలిసి ఓ బ్యాంకును దోపిడీ చేయాల్సి వస్తుంది. ఆ బ్యాంకుకు అధినేత క్రిష్ (జాన్ కొక్కెన్‌). అసలు కథ ఇక్కడితోటే మొదలవుతుంది. అసలు అజిత్ కి బ్యాంకు దోపిడీకి సుపారీ ఇచ్చింది ఎవరు? బ్యాంకు ను టార్గెట్ చేయడం వెనక అసలు కథ ఏమిటి? అజిత్ పాత్రలో వచ్చే ట్విస్టులు ఏమిటి? చివరకు ఎండ్ కార్డు ఎలా ఉంది? ఈ నేపథ్యంలోనే కథ మొత్తం సాగుతుంది.

 

విశ్లేషణ:

ఇంతకుముందు ఎన్నో సినిమాలు బ్యాంకు దొంగతనం నేపథ్యంతో వచ్చాయి. ఇదే టైపులో తెగింపు సినిమా కూడా రెగ్యులర్ గా సాగుతుంది. ఓ పోలీసు అధికారి తన స్నేహితుడి ఐడియా ప్రకారం బ్యాంకు దోపిడీ చేయడానికి ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేస్తాడు. ఎవరు ఊహించని విధంగా ఈ బ్యాంకు రాబరీ స్క్రిప్ట్ లో సడన్గా డార్క్ డెవిల్ అనే ఒక గ్యాంగ్స్టర్ ఎంట్రీ ఇస్తాడు. అతని ఎంట్రీ తో కథలో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటాయి.

 

మామూలుగా బ్యాంకు దోపిడీ అంటే ఒకే ప్రదేశంలో ఉంటుంది. కానీ అలా జరిగితే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు అని భావించిన దర్శకుడు బ్యాంక్ రాబరీ ఎంతో ఆసక్తికరంగా మలిచారు. దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. మరోపక్క బ్యాంకులో జరుగుతున్న మోసాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ జనాలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే విధంగా ఈ సినిమా సాగింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నప్పుడు ప్రాణాలు తీసుకోకుండా తెగించి ఆ ఫ్రాడ్ కు కారణమైన వాళ్ళని నిలదీయాలి అనేది ఈ మూవీ యొక్క ఉద్దేశం.

 

అజిత్ అంటేనే ఓ స్టైలిష్ హీరో అన్న పేరు ఉంది ఈ సినిమాతో అతను దాన్ని తిరిగి నిరూపించారు. ఈ సినిమా మొత్తం అజిత్ యాక్షన్కు 100% మార్కులు పడాల్సిందే. సినిమా స్టోరీ కి అజిత్ యాక్షన్ కి సూపర్ గా సెట్ అయింది అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

అజిత్ యాక్టింగ్

కామెడీ

భావోద్వేగ సన్నివేశాలు

బ్యాంకు రాబరీ నేపథ్యం

మైనస్ పాయింట్స్ :

ఊహించగల రొటీన్ కథ

నెమ్మదిగా సాగే కథనం

రేటింగ్ 2.5/5.0

బాటమ్ లైన్ : యాక్షన్ లవర్స్ కి మాత్రమే

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -