Unstoppable 2: అన్ స్టాపబుల్ కు ఆ ఇద్దరు స్టార్స్ వచ్చే ఛాన్స్ లేదా?

Unstoppable 2: ఇటీవలె సినిమా కంటే బుల్లితెరపై పలు షోలు ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా స్టార్ హీరోలు షోలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అందులోనూ అన్ స్టాపబుల్ షో ఇప్పుడు మంచి ఊపు మీద ఉంది. ఈసారి జరుగుతోన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ముగింపు దశకు చేరింది. బన్నీ, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి టాప్ హీరోలు అందరూ ఈ షోకు వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ లాంటి వారిని ఈ షోకు ఆహ్వానించారు కూడా. కానీ ఇద్దరిని మాత్రం ఈ షోకు అస్సలు పిలువలేదు. వారే ఎన్టీఆర్, మెగాస్టార్ అని తెలుస్తోంది. ఈ స్టార్ హీరోలు ఇద్దరినీ బాలయ్య పక్కన పెట్టేశారని సమాచారం.

 

దీంతో ఇటు మెగా అభిమానులు, అటు ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలంటే బాలయ్యకు అస్సలు పడదని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వాస్తవానికి ఈ షోలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ వస్తే బావుంటుందని అందరూ అనుకున్నారు. కానీ బాలయ్య మాత్రం ఆ దిశగా ఆలోచనే చేయలేదు. తన అల్లుడు లోకేష్ ను పిలిచారు కానీ పిల్లలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను పిలిచి ఉంటే బావుంటుందని అందరూ ఆశించారు. కానీ షోకు వారిని తీసుకురాలేదు.

 

అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి వంటి రాజకీయ నాయకులను పిలిచారు కానీ మెగాస్టార్ చిరంజీని మాత్రం ఆహ్వానించలేదు. నిజానికి ఆహా చేతిలో ఏమీ ఉండదని, బాలయ్య టిక్ పెట్టిన వారినే ఎక్కువగా పిలిచే అవకాశం ఉంటుందని మరికొందరు చర్చించుకుంటున్నారు.

 

మెగాస్టార్ చిరంజీవి అంటే బాలయ్యకు పడదని, గతంలో కూడా చాలా సార్లు వీరి మనస్పర్దలు బయటపడ్డాయని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం సైలంట్ గా ఉన్నా టీడీపీకి మాత్రం దూరంగా లేరు. అయితే ఇంకో పార్టీకి కూడా దగ్గరిగాను లేరు. మరెందుకు ఎన్టీఆర్ ను దూరం పెట్టారో అర్థం కావడం లేదని మరికొందరు అంటున్నారు. అదలా ఉంటే రామ్ చరణ్ ను కూడా బాలయ్య ఈ షో కు పిలువలేదు. చిరంజీవి తనయుడా అనా? అని మరికొందరు చర్చింకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల...
- Advertisement -
- Advertisement -