Best 5G Phones: తక్కువ ధరలో 5G స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి!

Best 5G Phones:  భారత మార్కెట్‌లో 5G నెట్‌వర్క్ త్వరలో విస్తరించనుంది. ఈ క్రమంలో చాలా మంది 5G ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఎలాంటి ఫోన్ కొనుగోలు చేయాలి. తక్కువ ధరలో ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో ఏ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీపావళి సందర్భంగా ప్రస్తుతం ఈ-కామర్స్ కంపెనీలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ప్రకటించాయి. రెడ్‌మి నోట్ 11టీ 5జీ, పోకో ఎం4 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం13 సహా పలు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ.15 వేలలోపు ఉండే 5జీ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.

రెడ్‌మి నోట్ 11టీ 5జీ..

శాంసంగ్ గెలాక్సీ ఎం13తో పోలిస్తే రెడ్‌మి నోట్ 11టీ 5జీ అధిక రిజల్యూషన్, రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. 6.6 అంగుళాల స్క్రీన్‌ను పొందవచ్చు. స్క్రీన్ ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో రన్ అవుతుంది. స్మోటర్ స్క్రోలింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం 90 హెచ్‌జెడ్‌ను కలిగి ఉంది. దీని హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌ను సెట్ చేశారు. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్, క్వాలిటీ ఫోటోలు, వీడియోలు పొందవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. దీని ధర రూ.14,999 ఉంది.

పోకో ఎం45జీ..

తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలనుంటే పోకో ఎం45జీ బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ.10,999గా ఉంటుంది. ఈ డివైజ్‌లో మీడియా టెక్ డైమిన్సిటీ 700 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. 18 డబ్యూ ఫాస్ట్ ఛార్జింగ్ పిన్ కూడా అందజేస్తారు. ఈ ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీనింగ్‌ను కలిగి ఉంది. 4జీబీ ర్యామ్‌తోపాటు 64 జీబీ స్టోరేజీని కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ..

శాంసంగ్ ఫోన్లలో 5జీలో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఫోన్లలో గెలాక్సీ ఎం13 5జీ. అమెజాన్‌లో దీని ధర రూ.12 వేల కంటే తక్కువగా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం, డిస్‌ప్లే కూడా బాగుంటుంది. 6.5 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ ఫోన్ అసలు ధర రూ.13,999 ఉండగా.. ప్రస్తుతం దీని ధర రూ.11,999గా ఉంది.

రియల్‌మి 9ఐ 5జీ..

రియల్‌మి 9ఐ 5జీ ధర రూ.13,499గా ఉంది. 90 హెచ్‌జెడ్ వద్ద 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే రెడ్‌మి నోట్ 11డీ 5జీ స్మార్ట్ ఫోన్‌తో చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీనికి కెమెరా సెటప్ అంతగా బాగుండదు. గెలాక్సీ ఎం13 లేదా రెడ్‌మి నోట్ 11టీ కంటే మెరుగైన పర్ఫార్మెన్స్‌ ను పొందవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -