Heroines: యాక్టింగ్ రాకపోయినా కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లు వీళ్లే!

Heroines: సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా మంది హీరోయిన్లకు నటన రాదనే దాని గురించి చర్చ నడుస్తోంది. యాక్టింగ్ రాకపోయినా చాలా మందికి అవకాశాలు మాత్రం వస్తూ ఉన్నాయి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు హీరోయిన్ల పరిస్థితి కొంత బాగుపడిందని చెప్పాలి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తే సావిత్రి, జమున, అంజలీ దేవి, కాంచన వంటివారు అద్భుతంగా నటించేవారు. ఆ రోజుల్లో నటనకు ఎక్కువ ఆస్కారం ఇచ్చేవారు.

 

ఆ తరం పోయాక మరో తరంలో వచ్చిన విజయశాంతి, రాధ, సుహాసిని, మాధవి, సుమలత, భానుప్రియలు నటనతో పాటు అందం అభినయంతో ఆకట్టుకున్నారు. వారే కాదు ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన సౌందర్య, రమ్యక్రిష్ణ, రంభ, రాశి, సిమ్రాన్, సంఘవి, మీనా, రోజాలు తమ గ్లామర్ తోనూ నటనతోనూ ఆకట్టుకున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు వచ్చిన హీరోయిన్లు మాత్రం కేవలం తమ అందచందాలతోనే ఆకట్టుకుంటున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

 

ఈ తరం హీరోయిన్లలో సమంత, కీర్తి సురేష్, నయనతార, త్రిష, తమన్నా, రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి వారు నటన తక్కువే అయినా గ్లామర్ మాత్రం ఆకట్టుకుంటున్నారు. వీరంతా నటన పరంగా అంతగా మెప్పించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్నవారిలో ఈ హీరోయిన్లు మాత్రమే బెస్ట్ అని నిరూపించుకున్నారు. అయితే ఈ హీరోయిన్లంతా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ వస్తున్నారు.

 

అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన శాలినీ పాండే ఇప్పుడు తెరపై కనిపించడం లేదు. ఆ హీరోయినే కాదు పాయల్ రాజ్ పుత్, నిధి అగర్వాల్, నభా నటేష్ వంటి వారి కెరీర్ అంతగా సాగడం లేదు. ఇప్పుడున్న జనరేషన్ లో ఈ హీరోయిన్లకు ఛాన్సులు అంతగా రావడం లేదు. లిప్ కిస్ లు, రొమాంటిక్ సీన్స్ లో నటించడం వల్ల వీరికి ఛాన్సుల మీద ఛాన్సులు వస్తున్నాయి. ఇలా చేస్తున్న హీరోయిన్లు ఎక్కువ కాలం తెరపై కనిపించకుండా పోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -