Heroes: లాయర్ రోల్స్ లో ప్రేక్షకులను మెప్పించిన స్టార్ హీరోలు వీళ్లే!

Heroes: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అందులో పవన్ లాయర్ పాత్రలో నటించి మెప్పించారు. టైటిల్ రోల్ లో పవన్ కళ్యాణ్ అదరగొట్టారని చెప్పవచ్చు. అయితే వకీల్ సాబ్ గా కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా ఇంకా టాలీవుడ్ లో చాలామంది హీరోలు నటించి మెప్పించారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల రవితేజ నటించిన రావణాసురుడు సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ఇకపోతే గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా ముఖచిత్రం. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లాయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే తమిళ హీరో సూర్య జై భీమ్ సినిమాలో లాయర్ పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. అలాగే హీరో సత్యదేవ్ నటించిన సినిమా తిమ్మరసు.

ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి తర్వాత విడుదల మొదటి సినిమా కావడంతో ఈ సినిమా బాగా హిట్ అయింది. అలాగే టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో లాయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి అభిలాష సినిమాలో లాయర్ పాత్రలో నటించారు. నందమూరి బాలకృష్ణ ధర్మక్షేత్రం సినిమాలో లాయర్ పాత్రలో నటించారు. హీరో వెంకటేష్ ధర్మచక్రం, శత్రువు సినిమాలో లాయర్ పాత్రలో నటించారు. అలాగే అక్కినేని నాగార్జున విక్కీదాదా,అధిపతి సినిమాలలో లాయర్ పాత్రలో నటించి మెప్పించారు. మోహన్ బాబు యమజాతకుడు సినిమాలో లాయర్ పాత్రలో నటించారు. ఈ హీరోలు మాత్రమే కాకుండా టాలీవుడ్ లో రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, సుమన్, అర్జున్, శ్రీకాంత్, జగపతిబాబు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావులతో నాటుగా ఎంతోమంది లాయర్లుగా నటించి మెప్పించారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -