Telangana Slang: తెలంగాణ స్లాంగ్ లో అద్భుతంగా మాట్లాడే స్టార్ హీరోలు వీళ్లే!

Telangana Slang: ప్రస్తుత కాలంలో సినిమాల మేకింగ్ విషయంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కథకి అనుగుణంగా హీరోలు తమ శరీరాకృతిని మార్చుకోవడమే కాకుండా భాష విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి ఒకే విధంగా కాకుండా ఆ పాత్ర ఏ ప్రాంతానికి చెందింది.. అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రాంతానికి తగ్గ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

 

ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇలా ప్రాంతానికి తగ్గట్టు యాసలో మాట్లాడుతున్నారు. .‘లవ్ స్టోరీ’ కోసం నాగ చైతన్య తెలంగాణ యాసలో , పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ‘దసరా’ కోసం నాని తెలంగాణ యాసలో మాట్లాడాడు. అయితే వీరు ఇలా పర్ఫెక్ట్ గా మాట్లాడటానికి క్లాసులు కూడా తీసుకున్నారు.

 

ఇప్పటికే చాలా సినిమాలలో మన హీరోలు తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటివరకు తెలంగాణ యాసలో మాట్లాడిన హీరోల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

చిరంజీవి : రుద్రనేత్ర అనే సినిమాలో ఒక పాత్ర కోసం చిరంజీవి తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

నాగార్జున: కింగ్ సినిమాలో నాగార్జున కూడా బొట్టు శీను పాత్రలో తెలంగాణా యాస లో మాట్లాడాడు.

 

పవన్ కళ్యాణ్: ‘ జల్సా’ , ‘ఖుషి’ ‘భీమ్లా నాయక్’ సినిమాల్లో అక్కడక్కడా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడాడు.

 

జూనియర్ ఎన్టీఆర్ : ‘బాద్ షా’ సినిమాలో రామారావు పాత్ర కోసం తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

 

అల్లు అర్జున్ : ‘రుద్రమదేవి’ సినిమాలో ‘గోన గన్నారెడ్డి’ పాత్ర కోసం తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడాడు.

 

రవితేజ : వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ తెలంగాణా యాసలో మాట్లాడి ఆకట్టుకున్నాడు.

 

అలాగే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ , జాతి రత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టి, డీజే టిల్లు సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ఇలా ఎంతో మంది హీరోలు తెలంగాణా యాసలో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -