Puja: పూజ చేసేటప్పుడు పాటించాల్సిన విషయాలు ఇవే?

Puja: భారతదేశంలో హిందువులు ఎంతోమంది దేవుళ్లను కొలుస్తూ ఉంటారు. ఇది హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని ఆచారాలు పద్ధతులు పాటిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పూజ విషయంలో కొన్ని రకాల విషయాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పూజ విషయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులను చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల పూజ చేసిన ఫలితం దక్కకపోగా దేవుడికి కోపం వస్తుంది.

హిందువులు చాలామంది ప్రతిరోజూ ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు. ఇంట్లో దీపారాధన చేయడం వల్ల పాజిటివిటీ ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. అయితే కొంతమంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తే మరి కొంతమంది ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. చాలామంది వారానికి ఒకసారి వారి కుల దైవానికి పూజ చేయడం కోసం పూజ గదిని శుభ్రం చేసి కలశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసినప్పుడు కొన్ని రకాల విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి..

 

మరి ఇంట్లో పూజ చేసినప్పుడు ఎటువంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీ ముఖం పడమర వైపు ఉండాలి. దేవుడి ముఖం తూర్పు వైపు ఉండాలి. అలాగే దేవత విగ్రహం ముందు ఎప్పుడు కూడా వెన్ను చూపించి కూర్చొని పూజ చేయకూడదు. పూజగది ఎప్పుడు ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈ దిశా దేవుడి ఆలయానికి అత్యంత పవిత్రమైనది. ఒకవేళ నైరుతి దిశలో ఉంటె పూజ ఫలితాలు తక్కువుగా ఉంటాయి.

 

అలాగే ఇంట్లో పూజగది ఉంటే ఖచ్చితంగా ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. ఇంట్లో దీపాలు వెలిగించడం ద్వారా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే పూజా చేసేటప్పుడు ఎక్కువగా నేలపై కూర్చొని పూజలు చేస్తారు. కానీ ఇలా చేయకూడదు. పూజ సమయంలో ఆసనాలను ఉపయోగించడం అవసరం ఆసనం పై కూర్చోకుండా పూజ చేయడం దరిద్రం అని చెప్పవచ్చు. అలాగే విష్ణువు, గణేశుడు, మహాదేవుడు, సూర్య దేవ్, దుర్గదేవి లను పంచ దేవుళ్లు అంటారు. వీరిని పూజించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -