Jr NTR: ఆ ఇద్దరు హీరోయిన్లను తన ముద్దులతో ముంచెత్తిన తారక్.. ఏమైందంటే?

Jr NTR:  తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు. సినీ ఇండస్ట్రీలో ఆయన తన నటనతో, డైలాగులతో, డాన్స్ లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. వ్యక్తిగతంగా ఆయన మాటలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ఎంత అల్లరి చేస్తారో.. ఇటీవల మనం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో చూసే ఉంటాం. తనలో కూడా ఫన్నీ యాంగిల్ ఉందని ఎన్టీఆర్ ప్రేక్షకులకు చూపించారు.

ఎన్టీఆర్ హీరోగా భారీ డైలాగులు చెబుతూనే చిన్న పిల్లోడిలా అల్లరి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ అనగానే అందరికి అదుర్స్ సినిమా కళ్ళ ముందుకు వస్తుంటుంది. ఆ సినిమాలో చారి పాత్రలో ఎన్టీఆర్ చేసిన కామెడీ చూసిన వారంతా ఇప్పటికి కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ 29 సినిమాలో నటించగా.. అందులో రెండు సినిమాల్లో మాత్రమే లిప్‌లాక్ సీన్స్ లో నటించారు. ఆ సినిమాలు ఏంటో, ఆ సినిమాలో నటించిన హీరోయిన్స్ ఎవరో ఒక్కసారి చూద్దామా.

ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ‘అశోక్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమీరా రెడ్డి నటించారు. ఈ మూవీలో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల నటించగా.. విలన్ పాత్రలో సోనూసూద్ నటించాడు. ఈ చిత్రానికి వల్లూరిపల్లి రమేష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డితో ఓ లిప్ లాక్ సిన్‌లో నటించారు.

అలాగే సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’. ఈ సినిమాను ఫాదర్ సెంటిమెంట్‌తో సుకుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, రాజీవ్ కనకాల నటించారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఓ పాటను కూడా పాడారు. ఈ మూవీలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్‌సింగ్ నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ – రకుల్ ప్రీత్‌సింగ్ ఓ లిప్ లాక్ సిన్‌లో నటించారు. ఈ ఇద్దరు హీరోయిన్లతో మాత్రమే ఎన్టీఆర్ రొమాన్స్ చేశారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts