Celebrities: 2022లో ఈ సెలబ్రిటీల పరువు గోవింద.. ఏం జరిగిందంటే?

Celebrities: సినీ ఇండస్ట్రీలో చూస్తే 2022లో చాలా వివాదాలు నెలకొన్నాయి. కొన్ని పరిశ్రమకు చెందినవైతే మరికొన్ని పర్సనల్ లైఫ్ కు సంబంధించినవి. మరి ఆ హాట్ వివాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కుతోంది. జాగ్రత్తగా తీయాల్సిన ఆదిపురుష్ సినిమా టీజర్ తోనే వివాదాల బారిన పడింది. టీజర్ లో రావణుడి పాత్రకు ఇచ్చిన వాహనం, హనుమంతుడితో పాటు వానర సేనకు వేసిన కాస్ట్యూమ్స్ పై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

అలయ్ బలయ్ కార్యక్రమంలో స్టేజ్ పై అభిమానులతో ఫొటోలు దిగుతున్న చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో వివాదాస్పదమైంది. కొన్ని రోజుల పాటు మాటల యుద్ధాలు జరగ్గా ఆ తర్వాత చిరంజీవి, ఈ వివాదానికి తనదైన శైలిలో ముగింపు పలికడంతో సద్దుమణిగింది.

కెరీర్ లో ఎన్నో ఫ్లాపులు తీసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏ సినిమా విషయంలో కూడా వ్యక్తిగతంగా డ్యామేజ్ కాలేదు. లైగర్ మాత్రం ఆ పని చేసినట్లు అయ్యింది. ఇది ఫ్లాప్ అవ్వడంతో బయ్యర్లు పూరి ఆఫీస్ పై పడి బహిరంగంగానే షాక్ ఇచ్చారు. దీనివల్ల పూరి ఇమేజ్ కొంత డ్యామేజ్ అయ్యింది.

2021లో సినిమా టికెట్ల వివాదం 2022 వరకూ కూడా వచ్చింది. పెద్ద సినిమాలకు రేట్లు పెంచడంతో ఆ తర్వాత మధ్యలో సీఎం జగన్ టికెట్ రేట్లను సవరిస్తే చాలా మంది ఫైర్ అయ్యారు. అయితే ఈ ఏడాది చాలా సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించినా వివాదం మాత్రం అలాగే ఉంది.

టాలీవుడ్ లో ఆర్టిస్టులు తమ సమస్యలు పరిష్కరించాలని వివాదం చేశారు. అప్పట్లో షూటింగ్స్ కూడా కొన్ని ఆపేశారు. అయితే దీనిపై టాలీవుడ్ నిర్మాతలు 2 గ్రూపులుగా విడిపోవాల్సి వచ్చింది. వీటికి సంబంధించి ఇప్పటికీ ఏవీ పూర్తిస్థాయిలో పరిష్కారమవ్వలేదని ఆర్టిస్టులు చెబుతున్నారు.

హాట్ యాంకర్ అనసూయ ట్వీట్ ఓ వివాదానికి దారి తీసింది. లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వగానే అనసూయ ‘కర్మ సిద్ధాంతం’ అంటూ ట్వీట్ చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే అనసూయ కొన్ని సోషల్ మీడియా ఎకౌంట్లపై ఫిర్యాదు కూడా చేసింది.

నరేష్, పవిత్ర లోకేష్ వివాదం తెరపైకొచ్చి వివాదం రేపింది. గత్యంతరం లేక పోలీస్ స్టేషన్ మెట్లను నరేష్, లోకేష్ ఎక్కారు. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

నయనతారకు పెళ్లయిన కొన్ని నెలలకే పిల్లలు పుట్టడంతో వివాదం చెలరేగింది. సరోగసీ ద్వారా నయన్ దంపతులు ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడంతో దీనిపై చాలా వివాదం నడవగా ఓ దశలో కేరళ సర్కార్ కూడా ఈ కాంట్రవర్సీపై రియాక్ట్ అయ్యింది.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -