Celebrities: ఈ టాలీవుడ్ సెలబ్రిటీల గురించి నమ్మలేని నిజాలు మీకు తెలుసా?

Celebrities: సినీ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు కామన్. చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న వారూ ఉన్నారు. ఇలాంటి వాళ్లు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఈ రోజు మనం సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు వ్యక్తిగత విషయాలను తెలుసుకుందాం.. తల్లులు వేరైనా తండ్రులు ఒక్కరిగా ఉన్న సెలబ్రిటీ హీరోలు, హీరోయిన్ల గురించి మాట్లాడుకుందాం..

 

అక్కినేని నాగార్జున..

అక్కినేని నాగార్జున టాలీవుడ్‌ స్టార్ హీరో. ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో నటించారు. 1984 ఫిబ్రవరి 18న విక్టరీ వెంకటేశ్ సోదరి లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుని దూరమయ్యారు. ఆ తర్వాత హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగార్జున-లక్ష్మికి నాగచైతన్య పుట్టగా.. నాగార్జున-అమలకు అఖిల్ పుట్టాడు. నాగచైతన్య, అఖిల్ కూడా టాలీవుడ్‌లో హీరోలుగా కొనసాగుతున్నారు.

 

నందమూరి హరికృష్ణ..

విశ్వనటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మూడో కొడుకు నందమూరి హరికృష్ణ. లక్ష్మితో హరికృష్ణకు వివాహం జరిగింది. వీరికి కళ్యాణ్ రామ్, సుహాసిని, జానకీ రామ్ పిల్లలు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ టాలీవుడ్‌లో హీరోగా కొనసాగుతున్నారు. అలాగే హరికృష్ణ.. శాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి జూనియర్ ఎన్టీఆర్ పుట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

 

సైఫ్ అలీ ఖాన్..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సైఫ్ అలీఖాన్ 1991లో అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు సారా అలీఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ పిల్లలు. 2004లో విడాకులు తీసుకున్న తర్వాత సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి తైమూర్ అనే పిల్లాడు ఉన్నాడు.

 

 

బోనీ కపూర్..

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ గురించి తెలిసిందే. ఈయన మోనా షారే కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అర్జున్ కపూర్, అన్షులా కపూర్ పిల్లలు. మోనాకు విడాకులిచ్చిన తర్వాత బోనీ కపూర్.. ప్రముఖ నటి శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి జాహ్నవి, ఖుషీ పిల్లలు. ప్రస్తుతం అర్జున్ కపూర్, జాహ్నవి ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Volunteers: వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే.. వైసీపీకి కొత్త శత్రువులు అవసరమే లేదుగా!

AP Volunteers: శత్రువులు ఎక్కడో ఉండరు.. మన ఇంట్లోనే కూతరు రూపంలోనో.. చెల్లెలు రూపంలో మన చుట్టూనే తిరుగుతారని ఓ సినిమాలో రావు రమేష్ అంటాడు. అక్కడ హీరోయిన్ గురించి చెప్పాల్సి వచ్చింది...
- Advertisement -
- Advertisement -