Dhanteras 2022: దీపావళి ఫస్ట్‌డే (ధంతేరాజ్‌స్‌) ఈ వస్తువులు కొనరాదు.. ఎందుకంటే!

Dhanteras 2022: మనదేశంలో అన్ని మతాల వారు నిర్వహించుకునే పండగలన్నీ శుభప్రదాల కారణంగా జరుపుకుంటారు. హిందువులు నిర్వహించే పూజల్లో దీపావళి పూజ అతి ముఖ్యమైంది. దీపావళి వేడుకల్లో మొదటిరోజు ధన్‌తేరస్‌ జరుపుకుంటారు. ధంతేరాస్‌ ను ప్రధాన పండుగగా పరిగణిస్తారు. శ్రేయస్సు, సంపద కోసం ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు.ఏడాది అక్టోబర్‌ 23న ధంతేరాస్‌ ను జరుపుకోనున్నారు. అయితే ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన వస్తువులతోపాటు, బంగారం, వెండి మొదలైవాటిని కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేస్తే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతుంటారు.

అయితే ధంతేరాస్‌ రోజున కొన్ని వస్తువులు కొనకూడదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి వస్తువులు కొనుగోలు చేస్తు ధన నష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి కలత చెందుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కృతిమ ఆభరణాలు.. ధంతేరస్‌ రోజున బంగారం, వెండి లేదా వజ్రాల ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈ రోజుమాత్రం కృత్రిమ ఆభరణాలను కొనుగోలు చేయరాదట. ఇలా చేస్తే మీ జీవితంలో సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ధంతేరాస్‌ రోజు కొనుగోలు చేసిన వస్తువులను పూజ సమయంలో లక్ష్మీదేవికి సమర్పించడం ఆచారం. అప్పుడే ఆ వస్తువులు ఉపయోగంలోకి వస్తాయి. అమ్మవారికి కృత్రిమ ఆభరణాలు సమర్పిస్తే ఇంట్లో దరిద్రం వస్తుందని నమ్ముతారు.

కారు, ఇల్లు..

ఈ రోజున కారు, ఇల్లు లేదా దుకాణం వంటి పెద్ద కొనుగోళ్లకు దూరంగా ఉండాలి. వీటిలో దేనినైనా కొనుగోలు చేయాలనుకుంటే, ఒక రోజు ముందుగానే డబ్బు చెల్లించి, ఆ తర్వాత కారును ఇంటికి తీసుకురావాలి. ఇల్లు కొంటే మాత్రం ముందుగానే డబ్బులు చెల్లించి ఆ తర్వాత రిజిస్ట్రేషన్, పత్రాలు తీసుకోవాలి.

కత్తులు, కత్తెరలు పదునైన పనిమూట్లు ..

సాధారణంగా ధన్‌తేరస్‌ రోజున పాత్రలు లేదా ఏదైనా వంటగది వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజున చాలా మంది మహిళలు షాపింగ్‌ వెళ్లినపుడు కత్తులు కత్తెర వంటి కొన్ని వంటగదికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజు ఎటువంటి పదునైన వస్తువులు లేదా పనిముట్లు కొనరాదు. ఇలా చేయడం ఇంట్లో గొడవలు పెరగడంతోపాటు లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

ఐరన్‌..

ధన్‌తేరస్‌ రోజు లోహాన్ని కొనుగోలు చేయడం శుభప్రదమని నమ్ముతారు. బంగారం, వెండికి బదులుగా ఇనుముతో తయారు చేసిన వస్తువును కొనుగోలు చేయకండి. ఎందుకంటే అది మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సుకు బదులుగా పేదరికాన్ని కలిగిస్తుంది. శనివారం ఇనుముతో తయారు చేసిన వస్తువులను కొంటే శనీశ్వరుడిని ఇంటికి ఆహ్వానించినట్లే.

ప్లాస్టిక్‌ వస్తువులు..

ధంతేరస్‌ రోజు ప్లాస్టిక్‌ పాత్రలను కొనరాదట. ఆ రోజున కొన్ని లోహాలను కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే ఈ రోజున ఏది కొనుగోలు చేసినా అది లక్ష్మీ పూజలో ఉపయోగించబడుతుంది. మీరు ప్లాస్టిక్‌ వస్తువులను కొనుగోలు చేస్తే దానిపై లక్ష్మీదేవికి ఏదైనా సమర్పించడం. పూజలో ఉపయోగించకూడదంటారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కార్పొరేట్ విద్య అంటే ఇదేనా.. ఏకంగా ఇంత చేశారా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలను కార్పొరేటర్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దామని నాడు నీడలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నత చదువులు చదువుతున్నారు...
- Advertisement -
- Advertisement -