Pregnancy: ఆ కారణంతోనే గర్భిణులు గ్రహణ సమయంలో బయటకు రారు!

Pregnancy: మన దేశంలో ఇప్పటికీ చాలా మూఢ నమ్మకాలను నమ్ముతూనే ఉంటారు. ఎంత టెక్నాలజీ పెరిగిన కూడా వాస్తులు, శాస్త్రలను బాగా నమ్మడంతో పాటు పాటిస్తుంటారు కూడా. అపుడప్పుడు ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణాల సందర్భంగా వివిధ పరిణమాలు ఏర్పడుతాయని చెబుతుంటారు. ఇందులో ముఖ్యం ఏమిటంటే అలా గ్రహాలు ఏర్పడేటప్పుడు గర్భిణులు బయటకు రారాదు.. ఎక్కువగా నడవరాదు అంటుంటారు. అందుకే గ్రహణ సమయంలో గర్భిణులను ఇళ్లలో ఉండే పెద్దలు జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక వేళ గ్రహణ సమయంలో గర్భిణులు బయట తిరిగితే వారికి పుట్టబోయే బిడ్డలకు గ్రహణ మొర్రి వస్తుందనే అపోహ చాలా మందిలో నాటుకుపోయింది.

 

అసలు విషయమేమిటంటే గ్రహణ మొర్రి అనేది గ్రహణ సమయంలో గర్భిణులు సరిగా ఉండకపోవడం వల్ల వస్తుందనే దాంట్లో ఎలాంటి ఆధారాలు, రుజువులు, శాస్త్రీయతా లేదు. గ్రహణ మొర్రి అనేది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే ఓ అవకరం. దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి ఇలా గ్రహణం మొర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సమయంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సమయంలో ఒకసారి బిడ్డ లోని రెండు పెదవులు, అంగిలి కలవవు.

 

అలాంటప్పుడు బిడ్డలో ఈ మొర్రి ఏర్పడుతుంది. అయితే.. నేటి ఆధునిక కాలంలో వివిధ రకాల శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడంతో గ్రహణ మొర్రి పెద్ద సమస్య ఏమీ కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణం మొర్రి సమస్యను పూర్తిగా తొలగించవచ్చని చెబుతున్నారు. గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే అసలు దాని గురించి ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరమే లేదు. అలాగని గ్రహణ సమయంలో ప్రత్యేకించి బయట తిరగమని చెప్పడం కాదు. అనుమానాలు, అపోహలు వీడి సాధారణంగా ఉండాలని పరిశోధకులు,నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -