Kitchen: కిచేన్‌లో ఆ వస్తువులు అస్సలు ఉండకూడదు.. ఎందుకో తెలుసా?

Kitchen: మనం ఎంత శుభ్రంగా ఉంటామో.. ఇంటిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని పెద్దలు, శాస్త్రలు సైతం చెబుతుంటాయి. అందుకే ఎక్కువ మంది ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంతో పాటు సంపద కూడా ఎక్కువవుతుందంటారు. ఇంట్లో ఉండే అతి ముఖ్యమైన ప్రదేశాలలో వంటగది కూడా ఒకటని చెప్పవచ్చు. దీనిని అన్నపూర్ణ గదిగా పిలుస్తూ ఉంటారు. వంటగదికి ఆరోగ్యానికి మధ్య అవినాభావ ఉందని చెబుతుంటారు. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా అంత శుభ్రంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వంట గది ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి కూడా అంతగా వస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు.

అయితే కొంతమంది మహిళలు వంటగదిని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాంటివారు కొన్ని విషయాలను తెలుసుకుంటే మంచిదని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. వంటగదిలో చీపురులను అసలు ఉండకూడదు. వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ శుభ్రం చేసేటువంటి చీపురును వంట గదిలో ఉంచకూడదు. వంట గదిలో చీపురును ఉంచితే ఆ ఇంట్లో తిండికి కొరత ఏర్పడుతుందట. ఇది ఇంటి సభ్యుల ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. వంట గదిలో మనం వేసుకొనే మందులను అసలు ఉంచుకోకూడదు. సాధారణంగా మాత్రలు వంటగదిలో ఉంచకూడదు ఎందుచేత అంటే ఇది కుటుంబ సభ్యులు ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తుంది.

వంటగదిలో అద్దం కూడా పెట్టకూడదు. వాస్తు ప్రకారం వంటగదిలో అద్దం ఉంచితే వారి జీవితం కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందంటారు. వంట గదిలో ఏదైనా విరిగిన పాత్ర, వస్తువులను సైతం ఉంచకూడదు కొంతమంది మహిళలు విరిగిన పాత్రలను ఉంచుతారు. ఇవి వాస్తు ప్రకారం చాలా ఇబ్బందిని కలిగిస్తాయట. ముఖ్యంగా ఏవైనా తుప్పు పట్టిన వాటిని ఉంచకూడదట అలాంటి వస్తువులు పెడితే రోగాలు వస్తాయని బాగా నమ్ముతారు. వాస్తు ప్రకారం వంటగదని వాస్తు నిపుణుల సలహాలతో ఎక్కడ ఏ వస్తువులు పెట్టాలో.. ఎలాంటి వస్తువులు పెట్టకూడదో అని తెలుసుకోవాలి. లేకపోతే పలు అనర్థాలకు దారితీస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -