Pakistan: అక్కడ సమాధులకు తాళాలు వేస్తున్నారట.. ఏం జరిగిందంటే?

Pakistan: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్ లో పరిస్థితులు ఏ మాత్రం మెరుగుపడలేదు. అవే దాడులు, మారణహోమాలు, మహిళలపై లైంగిక దాడులు. ప్రభుత్వాలు మారుతున్న, ప్రపంచ వ్యాప్తంగా మార్పులు చోటుచేసుకుంటున్నా, అక్కడ మాత్రం పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు కామాంధులు అత్యాచారాలు చేస్తున్నారు.

పాకిస్థాన్ లో పసిపిల్లల నుంచి పండు ముసలి వయస్సు ఉన్న ఆడవారి వరకు అందరినీ కామాంధులు కాటేస్తున్నారు. ఈ భయానక ఘటనలను ఐరాస సహా ప్రపంచ దేశాలు చూస్తున్నా, ఆ దేశాన్ని ఒక్కమాట అనటం లేదు. దీంతో పాకిస్థాన్‌లో కామాంధులు మరింత కళ్లు మూసుకుపోయారు. పూడ్చిపెట్టిన సమాధులలో నుంచి ఆడ శవాలను బయటికి తీసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇంత నీచానికి అడవి మృగాలు కూడా పాల్పడవని సభ్య సమాజం అంటోంది.

 

ఈ క్రూర కామాంధుల నుంచి తమ ఆడవారి మృతదేహాలను అపవిత్రం కాకుండా కాపాడుకునేందుకు బంధువులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. మరికొందరైతే ఏకంగా సమాధులకు లాకులు వేస్తున్నారు. ఇంకొందరు ఇనుప రాడ్లతో గ్రిల్స్ లాగా ఏర్పాటు చేసి వాటిలో తమ కుమార్తెల మృతదేహాలను సంరక్షించుకుంటున్నారు. ఎలాగూ కూతుర్లు పోయారు. కనీసం వారి గౌరవాన్ని అయినా కాపాడాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు.

 

గతంలో కరాచీలోని ఉత్తర నజీమాబాద్‌కు చెందిన కాటి కాపరి ముహమ్మద్ రిజ్వాన్ 48 మహిళా మృతదేహాలను సమాధుల నుంచి తవ్వి రేప్ చేశాడు. ఈ విషయాన్ని అతడు ఒప్పుకోవడంతో పెద్ద ఎత్తున వార్తలు వెళ్లువెత్తాయి. చనిపోయిన వారిపై అత్యాచారం చేయడాన్ని నెక్రోఫిలియా అంటారు.

 

పాకిస్థాన్ లో కేవలం ఒక్కచోట మాత్రమే ఇలాంటి కేసులు నమోదు కాలేదు. ఈ తరహా కేసులు పాక్ లో చాలానే నమోదు అయ్యాయి. మొదట 2011లో ఈ దాయాది దేశంలో తొలి నెక్రోఫిలియా కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్రూర చర్యలు కొనసాగుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -