Krishna- NTR: ఎన్టీఆర్ ని ఎదుర్కోవడానికి కృష్ణ వేసిన ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు!

Krishna- NTR: సినిమా ప్రపంచంలో పోటీతత్వం , అసూయ ద్వేషాలు కామన్ గా వుంటాయి. ఎందుకంటే చిత్ర పరిశ్రమ హిట్ ఇచ్చిన వాడి వెనకే వెళ్తుంది, గతంలో టాలీవుడ్లో ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్, కృష్ణ, శోబన్ బాబు పరిశ్రమ కు నాలుగు స్తంభాలు గా వుండే వారు. వీరి మధ్య సినిమాల విషయంలో పోటీతత్వం బాగా ఉండేది. ఎవరైనా మంచి సినిమా తీస్తే వారిని మించి హిట్ కొట్టాలని ఎప్పుడూ ప్రయత్నం చేసే వారు. ముందు ఈ పోటీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య బాగా ఉండేది. తర్వాత కాలంలో అది ఎన్టీఆర్, కృష్ణ మధ్య కూడా పెరిగింది.

వివరాల్లోకి వెళితే, ఎప్పటి నుండో బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర సినిమా చేయాలని,ఎన్టీఆర్ గారు బాగా ఇష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు. చివరకు ఆయన ముఖ్యమంత్రి గా వున్నపుడు ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి సినిమాల్లో న‌టించ‌డం ఏంట‌ని అన్నా కూడా ఆయ‌న అవేమి ప‌ట్టించుకోకుండా సినిమా స్టార్ట్ చేసారు. అప్పటికే కృష్ణ కాంగ్రెస్ సానుభూతి పరుడు. ఆయన ఎన్టీఆర్ పాల‌న‌ను ,ఆయ‌న ప్ర‌భుత్వ విధానాల‌ను తప్పు పడుతూ కొన్ని చిత్రాలు తీశారు

ఎన్టీఆర్ బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర ఎన్టీఆర్ తీస్తున్నారని తెలిసి పోటీగా 1989లో కృష్ణ హిందీలో ఒక చిత్రాన్ని తీయాల‌ని కృష్ణ నిర్ణ‌యించుకున్నారు.ఎన్టీఆర్‌కి పోటీగా వ‌చ్చే చిత్రంలో అమితాబ్ హీరోగా న‌టిస్తేనే దీనికి ధీటుగా ఉంటుంద‌ని.. త‌న రాజ‌కీయ ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి అమితాబ్‌ని ఒప్పించాడు. ఇక ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ నేష‌న‌ల్ ఫ్రంట్ చైర్మ‌న్‌గా ఉన్నారు బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర హిందీ వ‌ర్ష‌న్‌ని దెబ్బ‌తీయ‌డానికి కృష్ణ తీసే ఈ సినిమాకి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ ఇచ్చింది.

ఎన్టీఆర్ బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర చిత్రాన్ని 1991లో ఏప్రిల్ 14న విడుద‌ల చేశారు. ప్రారంభం నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్న గారు పౌరాణిక పాత్ర వేశారని బ‌య్య‌ర్లు సినిమా కొన‌డానికి పోటీ ప‌డ్డారు. ఎవరూ ఊహించని రికార్డు ధ‌ర‌కు బ్ర‌హ్మ‌ర్షి విశ్వ‌మిత్ర‌ను కొన్నారు. ఎన్టీఆర్ తీసిన సినిమాకు పోటీగా కృష్ణ తీసిన సినిమా ను కొనడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించలేదు. అలాగే నిర్మాత‌లు కూడా విడుదల కు అసక్తి చూపించ లేదు.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గాగా పదవి లో వుండగా న‌టించిన చిత్రం కావ‌డంతో దీనికి అంత క్రేజ్ వ‌చ్చింది. కాని బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర సినిమా ప్రేక్షకులను ఆకట్టకోలేకపోవడంతో ఫ్లాప్ అయింది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -