Father Daughter Attachment: తల్లిదండ్రుల ప్రేమ వర్ణణాతీతం. ఈ భూమ్మీద అన్ని బంధాల్లో తండ్రి కూతురు అనుబంధం వేరు. ఏ అమ్మాయికైనా తన మొదటి మేల్ బెస్టి ఎవరని అడిగితే తన తండ్రేనని చెబుతారు. తండ్రి అంటే ఓ స్నేహితుడిగా, లవర్‌గా, అన్నగా ఇలా సందర్భానుసారంగా తన కూతురికి అండగా నిలబడతాడు. అంతలా తండ్రి కూతురు అనుబంధం ముడిపడి ఉంటుంది. నిజం చెప్పాలంటే తండ్రి కూతురు అనుబంధంను వర్ణించడం చాలా కష్టం. కూతురి సంతోషం కోసం ఏం చేయడానికి కూడా తండ్రి వెనకాడడు. అయితే ప్రస్తుతం సొసైటీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో తండ్రి తన కూతురికి ఖచ్ఛితంగా కొన్ని విషయాలను ముందు నుంచే చెప్పాలి.
తండ్రి తన కూతురికి చెప్పాల్సిన 5 విషయాలివే..
1. చాలా మంది తల్లిదండ్రులు తమ కూతురికి చెప్పే సాధారణమైన సలహా.. ఎవరినీ అంత సులభంగా నమ్మకూడదని. ఎందుకంటే ఈ కాలంలో మంచితనంతో దగ్గరై మోసాలు చేస్తున్నారు. ఎంత మంచి స్నేహితుడైనా మనం జాగ్రత్తలో మనం ఉండాలని, ఎవరినీ అంత ఈజీగా నమ్మొద్దని చెబుతారు.
2. ప్రతి తండ్రి కొడుకు కోరిక కంటే కూతురి కోరిక తీర్చాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. కూతురి డ్రీమ్ కోసం ఎంత దూరమైన వెళ్తారు. ఎవరేం చెప్పినా.. మీ కలలు, ఆశయాలను వదులుకోవద్దని చెబుతుంటారు. లైఫ్ మీద, గోల్ మీద మాత్రమే ఫోకస్ పెట్టుకోవాలని సలహా ఇస్తారు.
3. నిర్దిష్ట వయసు వచ్చిన వెంటనే పెళ్లి గురించి చర్చ రావడం కామన్. అప్పుడు కూతురికి పెళ్లి ఇష్టం లేకపోతే.. చదువుకుంటానని చెప్పినప్పుడు తండ్రి సపోర్ట్ గా నిలబడాలి.
4. లైఫ్‌లో మంచిగా చదువుకోవాలని, చదువుతోపాటు ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించుకోవాలని చెప్పాలి. మగవాళ్లకు ధీటుగా పోటీ చేయాలని చెబుతుంటారు.
5. అందం అనేది ముఖంలో కాదు. హృదయానికి సంబంధించిందని చెప్పాలి. అందమైన మనసు, స్వచ్ఛమైన ఆత్మను కలిగి ఉండాలని చెప్పాలి. అందాన్ని చూసి ప్రేమ పేరుతో మోసం చేసే వారి నుంచి దూరంగా ఉండాలని చెప్పాలి.