Deepavali: పండుగ పూట లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకండిలా..

Deepavali: హిందువులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ దీపావళి. చీకటిపై వెలుగు గెలిచిన రోజుగా ప్రతిఒక్కరూ దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. అలాగే పండుగ పూట బంధుమిత్రులకు మిఠాయిలు పంచుతూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆ రోజు ఇల్లంతా దీపాల వెలుగులో బాణాసంచా కాలుస్తూ పండుగను వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈ పండుగ నాడు లక్ష్మీదేవి, వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎంతగా పూజిస్తే.. ఆ తల్లి కటాక్షం మనమై అంతగా ఉంటుందని పురోహితులు చెబుతున్నారు. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి అనుగ్రహానికి తప్పా.. ఆగ్రహానికి గురి కావొద్దని హెచ్చరిస్తున్నారు. అందుకు కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.

దీపావళి పండుగ రోజు ప్రతిఒక్కరూ తమ ఇంట్లో బ్రహ్మ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. బ్రహ్మ స్థలం అంటే ఇంటి మధ్యలో ఉండే హాల్. దీన్ని సూర్య స్థానం అంటారు. హాల్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ అశుభ్రంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. అలాగే ఇంట్లో పని చేయని వస్తువులను బయట పడేయాలి. అలాగే పండుగ రోజూ ఇంట్లో సభ్యులందరూ కొత్త బట్టలు ధరించాలి. బట్టల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పండుగ పూట నలుపు రంగు దుస్తువులు ధరించకూడదు. ఎందుకంటే నలుపురంగు బట్టలను అశుభంగా పరిగణిస్తారు. అందుకే పండుగ వేళ నలుపు రంగు దుస్తువులు అస్సలు ధరించకూడదు.

అలాగే దీపావళి పండుగ రోజు ప్రతిఒక్కరూ తమ తమ ఇళ్ల దగ్గర ముగ్గులు వేస్తుంటారు. అలా ముగ్గులు వేసినప్పుడు ఆ ముగ్గులో బియ్యం పిండిని కలుపుకోవాలి. బియ్యం పిండి కలిపిన ముగ్గుతోనే ముగ్గులు వేయాలి. అలాగే ముగ్గులో రంగులు వేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రంగుల ముగ్గులో నలుపు రంగు, డార్క్ బ్రౌన్ కలర్‌ను ఉపయోగించకూడదు. అలాగే బంధువులకు గిఫ్ట్‌ లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. బహుమతుల్లో పొరపాటున లెదర్ వస్తువులు గిఫ్ట్ ఇవ్వకూడదు. ఒక వేళ అలా ఇస్తే ధన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -