Pournami: పౌర్ణమి రోజు ఈ పనులు చేయండి.. ధనప్రాప్తి కలుగుతుంది..

Pournami: దేవత్వానికి నిలయం భారతదేశం. ఎన్నో ఆచార, సంప్రదాయాలు, దేవతామూర్తులను పూజించే సంస్కృతి కేవలం మన భారత దేశంలోనే ఉంది. సంవత్సర కాలంలో ఎన్నో రకాలు పూజలు, పండుగలు జరుపుకుంటాం. అన్ని రకాల సంప్రదాయాలు పాటిస్తాం. అయితే ధనప్రాప్తి కోసం పౌర్ణమి రోజులు భక్తులు పాటించాల్సిన కొన్ని ఆచారాలు, సంప్రదాయాల గురించి తెలుసుకుందాం. పౌర్ణమి రోజు కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించినట్లయితే ధనప్రాప్తి పొందుతారని పూజారులు చెబుతున్నారు. పౌర్ణమి రోజు భక్తులు స్థానిక ఆలయ ప్రాంగణానికి వెళ్లి రావి చెట్టును దర్శించుకోవాలని సూచిస్తున్నారు.

పౌర్ణమి రోజు ఉదయం 10 గంటలకు (రహస్య తంత్ర గ్రంథాల్లో ఎంతో ప్రత్యేకంగా ప్రస్తావించబడిన సమయం. అందుకే ఈ నియమాన్ని ఖచ్ఛితంగా ఉదయం 10 గంటలకు పాటించాలి) రావిచెట్టును దర్శించుకోవాలి. నీటిలో ఎలాంటి పదార్థాలను కలపకుండా.. స్వచ్ఛమైన నీటిని రావి చెట్టుకు పోయాలి. అయితే ప్లాస్టిక్ బకెట్లు, బిందెల్లో నీటిని పోయరాదు. కేవలం రాగి, ఇత్తడి, ఇనుము వంటి లోహాలకు చెందిన పాత్రల్లోనే స్వచ్ఛమైన నీటిని నింపి రావి చెట్టుకు పోయాలి.

అయితే చాలా మంది రావి చెట్టుకు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తారు. కానీ పౌర్ణమి రోజు రావిచెట్టు చుట్టూ ఎలాంటి ప్రదక్షిణ చేయరాదు. రావి చెట్టుకు స్వచ్ఛమైన నీటిని పోసిన తర్వాత.. ఆ రావి చెట్టును ప్రార్థించాలి. మంచి ఆదాయం, ధనప్రాప్తిని ప్రసాదించమని కోరాలి. ప్రార్థన ముగిసిన తర్వాత తిరిగి వచ్చేయాలి. కాగా, శ్రీ మహాలక్ష్మీ పౌర్ణమి తిథి నాడు తెల్లవారు జామున 10 గంటల సమయంలో రావిచెట్టు నందు కొలువై ఉంటారని రహస్య గ్రంథాల్లో చెప్పబడింది. ఆ సమయంలో మీరు కూడా రావి చెట్టుకు నీళ్లు పోసి.. ప్రార్థనలు చేస్తే.. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మీకు ధనప్రాప్తి జరుగుందని పూజారులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -