Kerala: మత సామరస్యానికి ఈ ఘటన ప్రతీక.. ఇది గొప్ప ఘటన అంటూ?

Kerala: ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరికి ఒకరు కాకుండా పోతున్నారు. ఒకరికి కష్టం వచ్చిందంటే ఎక్కడ సాయం అడుగుతారో అని మొహం చాటేస్తున్న రోజులు ఇవి. అలాంటిది రెండు మతాల మధ్య సంబంధం మరింత ఘోరంగా ఉన్నాయి. అయితే మతాలకి అతీతంగా ఈమధ్య జరిగిన ఒక పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఒక హిందూ అమ్మాయి రాజేశ్వరిని ముస్లిం మతానికి చెందిన మహిళ దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసింది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ అమ్మాయికి పెళ్లి కూడా చేసింది. కాళ్లు కడిగి మరి ఈ ముస్లిం దంపతులు కన్యాదానం చేయటం అందర్నీ ఆకర్షించింది. కేరళలోని భగవతి ఆలయంలో పెళ్లి జరిపించడం విశేషం.

 

కాగా పెళ్లి కుమారుడి పేరు విష్ణు ప్రసాద్. ఈ సంఘటన కేరళ కాసర్ గార్డ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్లా, ఖదీజా అనే ముస్లిం దంపతులు తన కూతురిని హిందువుల అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేశారు. పాప తల్లిదండ్రులను 10 ఏళ్ల వయసులో పోగొట్టుకుందని ఆ పాపని మతాలకి అతీతంగా పెంచి పెద్ద చేశారు ముస్లిం దంపతులు.

 

ఇప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. ఈ పెళ్లి చేయటం తమకు ఆనందంగా ఉంది అంటున్నారు అబ్దుల్లా. ఈ పెళ్ళికి హిందూ ముస్లింలకు చెందిన కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో జరగటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ద కేరళ స్టోరీ ని సినిమాగా తీయటం కాదు.

 

ఎవరికైనా దమ్ముంటే ఈ కథని సినిమాగా తీయండి అంటూ ఎన్సీపీ నేత జితేంద్ర ఆహ్వాద్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా ఈ పెళ్లి రెండేళ్ల క్రితం జరిగిందని ఇది కేరళ స్టోరీ సినిమా కారణంగా మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలిచిందని అంటున్నారు నెటిజెన్స్.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -