Heroines: కోట్లు రూపాయల ఆఫర్ చేసినా కూడా స్కిన్ షోకి నో చెప్పిన హీరోయిన్లు వీళ్ళే?

Heroines: సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు అవకాశాలు పొందాలంటే అందంగా ఉండటం చాలా అవసరం. అంతేకాకుండా వారి అందాలను ప్రేక్షకులకు కనిపించేలా ఎక్స్పోజింగ్ చేస్తేనే ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కూడా కొంతమంది హీరోయిన్లు గుర్తింపు పొందారు. ఇలా స్కిన్ షో కి దూరంగా ఉంటూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన హీరోయిన్ల వివరాలు చూసేద్దాం పదండి.

సౌందర్య :

కన్నడ నాట జన్మించిన సౌందర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఇలా ఫ్యామిలీ ఎంటర్టైలర్ సినిమాలలో ఎక్కువగా నటించిన సౌందర్య తాను నటించిన అన్ని సినిమాలలోనూ స్కిన్ షో కీ దూరంగా ఉంది. ఎక్స్పోజింగ్ చేయటానికి నిర్మాతలు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన కూడా సౌందర్య మాత్రం ఒక ఆడపిల్లగా తనకంటూ కొన్ని కట్టుబాట్లు పెట్టుకొని ఎక్స్పోజింగ్ చేయటానికి ససేమిరా అనింది. అయినప్పటికీ సౌందర్య లోని నటన ప్రతిభను గుర్తించిన ప్రేక్షకులు ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టారు. ఇప్పటికీ సౌందర్య లేని లోటు ఇండస్ట్రీలో స్పష్టంగా తెలుస్తోందని చెప్పవచ్చు.

లయ :

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన వారిలో లయ కూడా ఒకరు. ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించిన లయ కూడా ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉన్నప్పటికీ ఆమె నటనను ఆదరించిన ప్రేక్షకులు ఆమెను కూడా స్టార్ హీరోయిన్ గా నిలబెట్టారు.

స్నేహ :

తెలుగు తమిళ్ భాషలలో ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించిన స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్నేహ కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమెకు హీరోయిన్గా మంచి గుర్తింపు లభించింది.

నిత్యామీనన్ :

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందిన నిత్యమీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగుతున్న నిత్యామీనన్ కూడా ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

కీర్తి సురేష్ :

సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.

సాయి పల్లవి:

సాయి పల్లవి” ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి కాకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే నటీమణులలో సాయి పల్లవి కూడా ఒకరు. ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి పల్లవి మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత తెలుగు తమిళ్ కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ.. లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -