JrNTR: జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డ్ ఇదే!

JrNTR: ఎన్టీఆర్ మంచి నటుడు అని ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ లో ఉండే నటన ఆర్.ఆర్.ఆర్ చిత్రం ద్వారా అందరూ ఇంకొకసారి తెలుసుకున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రం ఇతర దేశాలలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ఆస్కార్ రేస్ లో కూడా ఉన్నారు. ఒక ప్రముఖ సంస్థ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ ప్రెడిక్షన్స్ లిస్ట్ విభాగంలో టాప్ 10 లో ఉన్నట్టు తెలిపింది.

జూనియర్ ఎన్ఠీఆర్ ధమాకా!

ఆస్కార్ అనేది ప్రముఖ అవార్డ్. సాధారణంగా హాలీవుడ్ స్టార్లు ఈ అవార్డు రేస్ లో ఉంటారు. కానీ ఎన్టీఆర్ ఈ అవార్డు లిస్ట్ లో ఉన్నాడు. ఇండియా యాక్టర్స్ ప్రెడిక్షన్స్ లిస్ట్ లో టాప్ 10 లిస్ట్ లో చేరడం మొట్టమొదటిసారి అని అంటున్నారు. ఇది ఒక హిస్టరీ అనే చెపుతున్నారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకూండా పోయాయి.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఒక నటుడు ఈ లిస్ట్ లో చోటు సంపాదించడం ఇదే మొదటిసారి. ఈ ఘనత సాధించిన తొలి నటుడుగా ఎన్టీఆర్ ని కీర్తిస్తున్నారు. చూడాలి మరి ఈ రేస్ లో ఎన్టీఆర్ ఎంత ముందుకు వెళ్ళగలడో. ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఓటీటీ లో విడుదలయిన తరువాత చాలా మంది ఈ చిత్రం ఆస్కార్ రేస్ లో ఉంటుంది అని అన్నారు. దానికి తగ్గట్టుగానే కొన్ని విభాగాల్లో ఈ చిత్రం దూసుకుపోతోంది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో కూడా ఆర్.ఆర్.ఆర్ చిత్రం పోటీ పడుతుందని చెపుతున్నారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ గోండు బొబ్బిలి కొమరం భీమ్ పాత్రని పోషించారు. ఈ పాత్రలో తారక్ అద్భుతంగా నటించాడనే చెప్పాలి. కొమరం భీముడొ పాట గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts