Nandamuri family: నందమూరి ఫ్యామిలీకి సొంతమైన రేర్ రికార్డ్ ఇదే!

Nandamuri family: తెలుగు సినీ చరిత్రలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక చరిత్ర ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి నేడు మూడో తరం హీరోలు సందడి చేస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ స్టార్ హీరోగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా తెలుసు. నందమూరి వంశం నుంచి మొత్తం 11 బ్యానర్లు ఉన్నాయి. ఆ బ్యానర్లను ఎవరు స్థాపించారో..వాటి విశేషాలేంటో ఓసారి తెలుసుకుందాం.

ఎన్ ఏ టీ ( నేష‌న‌ల్ ఆర్ట్స్ ) :
ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి త్రివిక్ర‌మ‌రావు నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నందమూరి తారక రామారావు ఎన్ ఏ టీ ఆర్ట్స్ స్థాపించారు. అప్ప‌ట్లో ఈ బ్యాన‌ర్‌ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.

 

రామ‌కృష్ణ సినీ స్టూడియోస్ :
ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడు రామ‌కృష్ణ చ‌నిపోవ‌డంతో ఆయన గుర్తుగా రామ‌కృష్ణ సినీ స్టూడియోస్ ను ఏర్పాటు చేశారు. నంద‌మూరి మోహ‌నకృష్ణ‌, జ‌య‌కృష్ణ ఈ బ్యాన‌ర్ వ్య‌వ‌హారాలు చూస్తుండేవారు.

ఆ త‌ర్వాత ఎన్టీఆర్, ఆయ‌న కుమారుడు ర‌క‌ర‌కాల పేర్ల‌తో బ్యాన‌ర్లు స్థాపించి ఎన్నో సినిమాలు చేశారు. అందులో కొన్ని..

తారకరామ ఫిల్మ్ యూనిట్,
రామకృష్ణ హార్టీకల్చరల్ స్టూడియోస్,
శ్రీమతి కంబైన్స్,

 

బ‌స‌వ‌రామ తార‌కం ప్రొడ‌క్ష‌న్స్:
మ‌ద్విరాట్ పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి చ‌రిత్ర సినిమాను ఈ బ్యాన‌ర్ లోనే తీశారు.

 

ఎన్బీకే ఆర్ట్స్ :
ఎన్టీఆర్ కొడుకు బాల‌కృష్ణ ఎన్బీకే ఆర్ట్స్ అనే బ్యాన‌ర్ ను స్థాపించారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు సినిమాలు కూడా ఈ బ్యాన‌ర్ మీదే తీశారు.

 

యువరత్న ఆర్ట్స్: బాల‌య్య హీరోగా యువ‌ర‌త్న ఆర్ట్స్ అనే బ్యాన‌ర్లో కొన్ని సినిమాలు తెరకెక్కాయి.

ఎన్టీఆర్ ఆర్ట్స్ :
నంద‌మూరి వంశ‌లో మూడో త‌రం హీరో, ఎన్టీఆర్ మ‌న‌వ‌డు అయిన నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ తాత‌పేరుతోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ స్థాపించి చాలా సినిమాలు చేశారు. ఎన్టీఆర్ హీరోగా జై ల‌వ‌కుశ‌, ర‌వితేజ‌తో కిక్ 2 సినిమాలు కూడా ఇదే బ్యాన‌ర్లో నిర్మించారు.

 

బ‌స‌వ‌తార‌క‌రామా బ్యాన‌ర్ :
ఇక తాజాగా ఈ ఏడాదిలోనే ఎన్టీఆర్ మ‌రో త‌న‌యుడు నంద‌మూరి జ‌య‌కృష్ణ బ‌స‌వ‌తార‌క‌రామా బ్యాన‌ర్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ నుంచి ఇకపై సినిమాలు తీస్తున్న‌ట్టు తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -