Balayya: బాలయ్య నిజస్వరూపం ఇదే.. అలాంటి వ్యక్తి!

Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరున్న నందమూరి హీరో నందమూరి బాలయ్య. ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. అదే సమయంలో తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. తన తండ్రి అంటే బాలయ్యకు ఎంత గౌరవమో, ప్రేమో అందరికీ తెలిసిందే.

 

అయితే తన తండ్రిని అగౌరవపరిచేలా, అవినీతిపరుడనే ముద్రవేసేలా ఎన్టీఆర్ పాత్రలో నటించిన కోట శ్రీనివాస రావు అంటే నందమూరి బాలయ్యకు విపరీతమైన కోపం అట. నిజానికి ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, కృష్ణల మధ్య వైరం ఉండేది. కురుక్షేత్రం, దానవీరశూరకర్ణ సినిమాలతో ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. చివరకు ఇది ఇద్దరి మధ్య రాజకీయ వైరంగా మారింది.

 

అయితే ఎన్టీఆర్ సీఎంగా ఉన్న టైంలో కృష్ణ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ‘మండలాధీశుడు’ అనే సినిమాను నిర్మించాడు. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో కోట శ్రీనివాసరావు కనిపించారు. ఎన్టీఆర్ పాత్రలోని కోటా శ్రీనివాసరావును ఈ సినిమాలో అవినీతి పరుడిగా చూపించారు. దీంతో నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ ని ఇష్టపడే వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసారి విజయవాడకు కోటా శ్రీనివాసరావు రాగా.. అక్కడికి చేరుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఏకంగా కోటాను చితకబాదారు.

 

మొత్తానికి ఆ సినిమా విడుదలైన తర్వాత ఓసారి షూటింగ్ టైంలో నందమూరి బాలయ్య ముందుకు కోటా శ్రీనివాసరావు వెళ్లాడట. అక్కడ ఉన్న వాళ్లంతా కోటాను అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెబుతున్నా వినలేదట. బాలయ్య ముందుకు వెళ్లిన కోటా శ్రీనివాసరావు.. ‘నమస్కారం బాబు’ అని అన్నాడట. కోపంతో ఊగిపోయిన బాలయ్య.. కాండ్రించి కోటా శ్రీనివాసరావు ముఖం మీద ఉమ్మేశాడట. అప్పట్లో ఇది పెద్ద సంచలనమైంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -