Chiranjeevi: నటవారసత్వం గురించి చిరంజీవి అభిప్రాయం ఏంటో తెలుసా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా అందరికీ సుపరిచితమే. ఎవరి సపోర్ట్ లేకుండా, ఒంటరిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై కొన్ని దశాబ్దాల పాటు అగ్ర నటుడుగా కొనసాగాలంటే అదేమీ మామూలు విషయం కాదు.

ఇక మెగాస్టార్ చిరంజీవి తన నటనతో, డాన్స్ తో, ఫైట్స్ తో తనకంటూ ఒక చెరగని స్థానాన్ని ప్రేక్షకుల మదిలో ముద్రించుకున్నారు. రోజురోజుకు చిరంజీవి క్రేజ్ పెరుగుతూ మెగాస్టార్ గా నిలిచాడు. ఇదంతా పక్కన పెడితే.. గతంలో మెగాస్టార్ చిరంజీవిని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు చిరంజీవి చాలా సింపుల్ గా సమాధానం ఇవ్వడం జరిగింది.

చిత్ర పరిశ్రమలో పోటీ, వారసత్వం కొనసాగుతున్నాయి కదా దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నకు బదులుగా చిరంజీవి తనకు తానే పోటీ అని టాలెంట్ అనేది ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు.. నట వారసత్వం ఉన్న కూడా టాలెంట్ లేకపోతే ఏ ఇండస్ట్రీలో అయినా రాణించడం కష్టం అని తెలపడం జరిగింది.

ఇక సినీ ఇండస్ట్రీలో ఉండే పోటీ.. నా ఎదుగుదలకు బాగానే ఉపయోగపడింది. సినీ ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది తప్ప మరొకటి లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ప్రశ్నగా హీరోలకు ఉన్నంత గుర్తింపు క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఎందుకు గుర్తింపు ఉండదు అనే ప్రశ్న ఎదురయింది.

అందుకు తాను సమాధానంగా అదేం లేదు. గుర్తింపు అనేది నటన నిరూపించుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉదాహరణకు ఎస్వీ రంగారావు గారు, నాగభూషణం గారు, రేలంగి గారు, రాజబాబు గారు, సూర్యకాంతం గారు ఇలా చాలామంది ఉన్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలను ప్రేక్షకులు తమ ఆ స్థానంలో ఉన్నాము అన్నట్లు ఫీల్ అయ్యి అభిమానించడం ద్వారా అలా అనిపిస్తుంది.

అలా పోల్చుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్టులకు, హీరోలకు ప్రేక్షకులు ఆదరించే విధానం కాస్త డిఫరెంట్ గా ఉండవచ్చు అని తెలపడం జరిగింది. ఇక మరో ప్రశ్నగా సినీ ఇండస్ట్రీలో ప్రతిభ, అదృష్టం మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే.. ఎందుకు ప్రతిభ ఉంటే చరిత్రలో నిలిచిపోతారు. స్ఫూర్తిదాయకంగా విజయాలను సాధిస్తారు. అదే అదృష్టం ఉంటే అది అప్పటికప్పుడు మాత్రమే సంతోషాన్ని కలిగిస్తుంది స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో అనుకున్నంత విజయాలు రావడానికి ఆస్కారం ఉండదు అని తెలపడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -