Pavitra Lokesh-Naresh: ఇది టీజర్ మాత్రమే.. పవిత్ర నరేష్ అలా చేయబోతున్నారా?

Pavitra Lokesh-Naresh: తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం సినిమాలు, వాటి వల్ల ఏర్పడ్డ రికార్డులు, కొత్త సినిమాల అప్ డేట్లే కాదు.. కొన్నిసార్లు వివాదాలు చాలా పాపులర్ అవుతుంటాయి. అలాంటి పాపులర్, ట్రెండీ న్యూస్ ఈ మధ్యన ఎక్కువగా నరేష్-పవిత్రా లోకేష్ లు ఇస్తున్నారు. ఆమధ్యన మైసూర్ లోని ఓ హోటల్ లో నరేష్-పవిత్రలు కలిసి ఉండగా.. నరేష్ మూడో భార్య అక్కడికి చేరుకొని నానా రచ్చ చేయడంతో వివాదం వార్తల్లోకెక్కింది.

 

నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. తన భార్యలకు విడాకులు ఇచ్చి ఉన్నాడు. మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన పవిత్రా లోకేష్ తో ఈ మధ్యన కలిసి ఉంటున్న నరేష్.. ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశాడు. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసిన నరేష్-పవిత్రలు ఏకంగా లిప్ కిస్ పెట్టుకొని కొత్త ప్రారంభానికి మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ వీడియో పెట్టేశారు.

 

లేటు వయసులో నరేష్ – పవిత్రలు పెట్టిన వీడియో, అందులోని లిప్ కిస్ అందరినీ ఆశ్చర్య పరిచింది. ముసలి వయసులో ఇద్దరు భలే జంట అవుతున్నారంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తుంటే, మీమ్స్ మాత్రం విపరీతంగా వచ్చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో ఒకటి కాబోతున్నాం అనే విషయాన్ని చెప్పడానికి లిప్ కిస్ పెట్టుకున్న నరేష్-పవిత్రల నుండి ఇంకా చాలా వీడియోలు వస్తాయనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

 

నరేష్ చేసుకోబోయే నాలుగో పెళ్లి, పవిత్ర చేసుకోబోయే రెండో పెళ్లికి ఇలాంటి హాట్ వీడియోలు చాలా వస్తాయనే ట్రోలింగ్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సాగుతోంది. ఇంకా వీళ్ల నిశ్చితార్థం, సంగీత్, హల్దీ, పెళ్లి వీడియోలతో రచ్చరచ్చ చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మొత్తానికి ఎంతో కాలంగా ఈ వార్త చెప్పాలని చూస్తూ వచ్చిన నరేష్-పవిత్రలు ఎవరూ ఊహించని విధంగా లిప్ కిస్ తో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటివి ఎన్ని వస్తాయో అనేది కాలమే సమాధానం చెబుతుంది.

Related Articles

ట్రేండింగ్

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు.. జగన్ సర్కార్ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే!

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టుని ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారం రోజులుగా ఈ పోర్టులో...
- Advertisement -
- Advertisement -