Pawan: పవన్ స్టామినా ఇదీ.. ఆయన తలచుకుంటే రికార్డులే అంటూ?

Pawan: మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు గురించి మనందరికీ తెలిసిందే. సినిమాల ద్వారా కంటే బుల్లితెరపై ప్రసారం అయ్యే పలుషోలకు జడ్జిగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు నాగబాబు. చాలామందికి నాగబాబు జబర్దస్త్ జడ్జిగా సుపరిచితం. ఇది ఇలా ఉంటే జబర్దస్త్ నుంచి దూరమైన తర్వాత నాగబాబు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. అంతకుముందు కూడా రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్న నాగబాబు ఈ మధ్యకాలంలో మరింత ఊపందుకున్నారు.

జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని ఇటీవ‌ల ద‌క్కించుకున్న నాగ‌బాబు, పార్టీని బ‌లోపేతం చేసేందుకు త‌న వంతు తిప్పలు ప‌డుతున్నారు. కాగా ఈ నెల 14న వారాహి యాత్ర అన్న‌వ‌రం నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఆయ‌న బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు. ఇందులోని ప్ర‌తి అక్ష‌రం నాగ‌బాబు లోని హాస్య చ‌తుర‌త‌ను బ‌య‌ట పెట్టింది. బ్ర‌హ్మానందం అదృష్టం కొద్దీ నాగ‌బాబు సీరియ‌స్‌గా కమెడియ‌న్ పాత్ర‌లు వేయ‌లేదు. ఆ లేఖలో ఈ విధంగా గా రాసుకొచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పు కోసం శంఖారావం మోగించ‌డానికి వారాహి బ‌య‌ల్దేరుతోంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేప‌ట్ట‌నున్న వారాహి యాత్ర రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌రిత్ర సృష్టించ‌బోతోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల‌నివ్వ‌న‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌త రెండేళ్లుగా చెబుతున్నారు.

 

ఇక ప‌వ‌న్ శంఖారావం ఎవ‌రిని సీఎం చేయ‌డానికో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా వారాహి యాత్ర‌తో నాగ‌బాబు చెబుతున్న‌ట్టు రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌రిత్ర సంగ‌తేమో గానీ, క‌నీసం జ‌న‌సేన‌లో మార్పు తీసుకొస్తే అదే ప‌దివేలు. జ‌న‌సేన‌ను రాజ‌కీయంగా బ‌ల‌ప‌రిచేలా వారాహి యాత్ర సాగితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌క్సెస్ అయ్యిన‌ట్టే అని తెలిపారు. ప్ర‌జ‌లంతా క‌లిసి మెలిసి జీవించే వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌డ‌మే వారాహి యాత్ర ప్ర‌ధాన ధ్యేయం. ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న అనిశ్చిత‌ ప‌రిస్థితుల నుంచి గ‌ట్టెక్కాలంటే జ‌న‌సేన పాల‌న రావాల్సిందే అనే ఆశాభావంతో రైతులు, మ‌హిళ‌లు, యువ‌త, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార‌స్తులు ఇంకా అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. ప‌వ‌న్‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అనే శ‌క్తిని అందిస్తే ఎంతో మందికి ఉప‌యోగ‌క‌ర‌మైన సేవ‌లు అందిస్తారనే భావ‌న ప్ర‌జ‌ల్లో నాటుకుంది అని తెలిపారు నాగబాబు.

 

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -