Prabhas: స్టార్ హీరో ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇదే.. అక్కడే చేసుకోనున్నారా?

Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ కూడా ఒకరు. కాగా హీరో ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఒక ఇంటివాడు అవుతాడా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో బాహుబలి సినిమా తర్వాత చేసుకుంటాను అన్న ప్రభాస్ నా సినిమా విడుదల అయ్యే దాదాపు ఐదారు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు. ఇప్పటికే చాలాసార్లు ప్రభాస్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వెరీ అయిన విషయం తెలిసిందే.

అనుష్క అని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. తర్వాత కృతిసనన్ తో కూడా ప్రేమాయణం నడిపిస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలపై ఇప్పటి వరకు స్పందించలేదు ప్రభాస్. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా తిరుపతిలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

 

ఈ ఈవెంట్‌లో ప్రభాస్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ఏడు నెలల క్రితం మొదటిసారి 3డీ ట్రైలర్ ఫ్యాన్స్ చూడాలని డైరెక్టర్‌కు గట్టిగా చెప్పాను. ట్రైలర్ చూసి అభిమానులు ఇచ్చిన ప్రొత్సాహమే మమ్మల్ని ఇంతవరకు నడిపించింది. నన్ను ఒకసారి చిరంజీవి గారు కలిసినప్పుడు రామాయణం చేస్తున్నావా అని అడిగారు. నేను అవునంటే దానికి ఆయన రామాయణం చేయాలంటే అదృష్టం ఉండాలని న్నారు. నిజంగానే ఆదిపురుష్ సినిమా కాదు నా అదృష్టం. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తాను. తక్కువ మాట్లాడుతా ఎక్కువ సినిమాలు చేస్తాను అన్నారు. అభిమానులు పెళ్లి ఎప్పుడని అడగగా దానికి సమాధానంగా ఇక‍్కడే తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటాను ఎప్పుడైనా అని తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -