Sai Pallavi-Samantha: సాయిపల్లవి సాయితేజ్ సమంత మధ్య ఉన్న పోలిక ఇదే!

Sai Pallavi-Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సమంత, సాయి పల్లవి, సాయి ధరమ్ తేజ్ గురించి మనకు సుపరిచితమే. తాజాగా ఈ ముగ్గురిలో ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్లినా చేతికి రుద్రాక్ష మాలలు ధరించి వెళ్లడం విశేషం.ఇలా ఈ ముగ్గురు చేతులకు రుద్రాక్ష మాలలు ఉన్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ కావడంతో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

 

సాధారణంగా ప్రతి ఒక్కరూ భగవంతుడిని నమ్ముతారు. ఇలాదేవుడు ఉన్నారని నమ్మిన వారు తాము ఎక్కడికి వెళ్లినా తమకు తోడుగా ఆ భగవంతుడు ఉంటారని భావిస్తుంటారు.ఒక మనిషి జీవితంలో అనుకోని క్లిష్ట పరిస్థితులు ఎదురయి ఆ పరిస్థితులు చావును దగ్గరగా చూపించి వెనక్కు తీసుకువస్తే ఆ మనిషి దైవాన్ని తప్ప ఇతరులను ఎవరిని నమ్మరు ప్రస్తుతం అలాంటి పరిస్థితులలో సాయి ధరమ్ తేజ్ సమంత ఉన్నారని చెప్పాలి.

సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సమయంలో ఆయన గొంతు పూర్తిగా వెళ్ళిపోయింది మాటలు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో ఈయన మీడియాకి కూడా దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన బయటకు వచ్చిన ప్రతిసారి తన చేతికి రుద్రాక్ష మాలను ధరిస్తూ బయటకు వస్తున్నారు. ఇలా రుద్రాక్ష మాల తనకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుతుందని భావిస్తున్నారు.

ఇక సమంత సైతం మయోసైటిసిస్ నుంచి కోలుకున్న తర్వాత చేతికి రుద్రాక్ష మాలను ధరించి మీడియా ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె కూడా ఆధ్యాత్మిక భావనలో ఉంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసమే ఇలా రుద్రాక్షలను ధరించారని తెలుస్తోంది.ఇక నటి సాయి పల్లవి మొదటి నుంచి తను ఎక్కడికి వెళ్లినా ఏ సినిమా ఈవెంట్లో పాల్గొన్న చేతికి రుద్రాక్ష మాలను మనం చూస్తూనే ఉన్నాం.ఇలా దేవుడిపై నమ్మకం భక్తితో ఈ ముగ్గురు కూడా చేతికి రుద్రాక్ష మాలలను ధరించి కనిపిస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Giddi Eswari: పాడేరు టికెట్‌‌ గిడ్డి ఈశ్వరికే ఎందుకు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Giddi Eswari:  ఎన్నికలకు పెద్దగా సమయం లేదు కానీ చంద్రబాబు నాయుడు చివరి క్షణంలో కూడా అభ్యర్థులను స్థాన మార్పిడి చేస్తూ అనూహ్యంగా కొత్తవారికి కూడా టికెట్లు కేటాయిస్తూ ఉన్నారు. ఇలా పలుచోట్ల...
- Advertisement -
- Advertisement -