Bombay Padma: నటి బాంబే పద్మ ఆ సినిమా షూటింగ్ సమయంలో ఘోరమైన కష్టం ఎదురుకుందా?

Bombay Padma: బాంబే పద్మ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చలనచిత్రాలలో నటిస్తుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పద్మ త్రినేత్రం సినిమా షూటింగ్ లో తాను పడ్డ కష్టాలను ఇంటర్వ్యూలో పంచుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన త్రినేత్రం సినిమాలో బాంబే పద్మ, ఏం.ఎస్ నారాయణకు భార్య పాత్రలో నటిస్తుంది.

ఎం. ఎస్ నారాయణ తన భార్యను ఒక బొమ్మలాగా కళ్ళు చిదంబరానికి అమ్మేసే పాత్ర అది. అందుకు తనపై బురద వేసి బొమ్మలాగా కూర్చోబెట్టరట. కానీ ఆరోజు ఎమ్మెస్ నారాయణ షూటింగ్ కు రాలేదట. రెండవ రోజు కూడా ఇలాగే జరగడంతో కోడి రామకృష్ణ గారు ఎందుకు ఆమెను అలా కూర్చోబెట్టారు అంటే ఎం. ఎస్ నారాయణ గారు ఇంకా రాలేదు.

ఆయనకు ఫోన్ చేస్తే వస్తున్న అంటున్నారు అనే విషయం చెప్పారట. బయట ఇంత చలి పెట్టుకుని ఆయన వచ్చిన తర్వాతే బురద వేసి కూర్చోబెడితే సరిపోతుంది కదా అని ఫోన్ చేసి కోడి రామకృష్ణ గారు కోపగించుకున్నారు అనే విషయం తెలిపింది. మూడవరోజు ఎమ్మెస్ నారాయణ గారు వస్తే ఆ పాత్ర షూటింగ్ కంప్లీట్ చేశారట.

ఇక బాంబే పద్మ తనపై బురద ఉండడంతో ఎవరూ కూడా తమ కారులో ఎక్కించుకోలేదట అందుకు కారణం కారుకు బురద అంటుతుంది అనుకున్నారు అందరూ. పోనీ అక్కడే శుభ్రం చేసుకుందాము అని అనుకుంది. కానీ అక్కడ నీళ్లు లేకపోవడంతో ప్రొడక్షన్ వ్యాన్ లో ఒక గిన్నె బోర్లించుకుని దానిపై కూర్చొని ఇంటికి వచ్చిందట.

తన కుమారుడికి ఫోన్ చేస్తే ఇంటి దగ్గర నీళ్లు రెడీగా ఉంచడంతో వెంటనే వెళ్లి శుభ్రం చేసుకునేదట. ఇప్పటికీ కూడా రెక్కాడితే కానీ డొక్కాలని పరిస్థితి ఆమెది. నటుడు నరేష్ ని కలిస్తే పింఛన్ వచ్చేలా చేశారని పేర్కొంది. మళ్లీ ఆయనతోనే సినిమా అవకాశాలు అడిగితే బాగుండదు అనిపించింది. అప్పుడప్పుడు ఆలీని అడిగితే ఎక్కడైనా అవకాశం ఉంటే తనకు ఇప్పించేవాడని తెలిపింది. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన ఆడిషన్స్ కి వెళ్లి తన ప్రయత్నం తాను చేస్తున్నట్లు పేర్కొనడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -